Horoscope Today December 20th 2024 : డిసెంబర్ 20వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని మౌనాన్ని ఆశ్రయించడం శ్రేయస్కరం. శివారాధన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో పనిచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తిని పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు అందుతాయి. పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తే మంచిది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే సఫలీకృతం అవుతారు. ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందవచ్చు. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తితో ఉంటారు. సన్నిహితులతో, ఇరుగుపొరుగువారితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన లావా దేవీల పట్ల అపరమత్తంగా ఉండాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. షేర్ మార్కెట్లో భారీ నష్టాలను చూడాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో ప్రశాంతత కోల్పోతారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. సమాజంలో పరపతి పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో వేసే ప్రతి అడుగు విజయం వైపు నడిపిస్తుంది. అహంకారం, గర్వం దరిచేరకుండా చూసుకోండి. ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేసి ప్రసంశలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో కలహాలు రాకుండా చూసుకోండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీరామాలయం సందర్శన మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక వేదనతో ఇబ్బంది పడిన మీకు ఉపశమనం దొరుకుతుంది. కలిసి వచ్చే కాలం మొదలైంది. ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయడం సంతృప్తినిస్తుంది. వృత్తి పరంగా కొన్ని సవాళ్లు ఎదురైనా మనోబలంతో అధిగమిస్తారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు విజయవంతంగా, సమయంలోపే పూర్తిచేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూమి, ఇల్లు కొనుగోలు చేయడానికి మంచిరోజు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దైవబలం అండగా ఉంటుంది. గణపతి ప్రార్థన శుభకరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించడం అవసరం. వృత్తి పరంగా నైపుణ్యాలు పెంచుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. ఆర్ధిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.