ETV Bharat / entertainment

చిరంజీవితో కలిసి నటించడంపై స్పందించిన మోహన్‌బాబు - ఏమన్నారంటే? - MOHANBABU CHIRANJEEVI

తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్పెషల్ మూవీ గురించి చెప్పిన మోహన్​ బాబు.

Chiranjeevi Mohanbabu
Chiranjeevi Mohanbabu (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2024, 5:20 PM IST

Mohanbabu Chiranjeevi : తన సినీ నట ప్రయాణంలో ఇటీవలే 50వ వసంతంలోకి అడుగు పెట్టారు సీనియర్ యాక్టర్​ మంచు మోహన్‌ బాబు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా ఇష్టమైన పలు చిత్రాలను ఉద్దేశించి గత కొన్ని రోజులుగా ఆయన పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆయా సినిమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. అలా తాజాగా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్పెషల్ మూవీ గురించి ఆయన మాట్లాడారు. అదే 'పట్నం వచ్చిన పతివ్రతలు' (Patnam Vachina Pativrathalu).

మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరు, మోహన్​ బాబు అన్నదమ్ములుగా నటించారు. రాధిక, గీత హీరోయిన్లుగా నటించారు. 1982లో విడుదలైన ఈ సినిమా గురించి తాజాగా మోహన్‌బాబు సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ చిత్రాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు.

"నా సినీ జర్నీలో 'పట్నం వచ్చిన పతివ్రతల'కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతిభావంతుడైన మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ పాత్రను పోషించడం, ముఖ్యంగా నా స్నేహితుడు చిరంజీవితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో ఇదీ ఒకటి" అని మోహన్​బాబు అన్నారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మనవళ్లను పెంచి పెద్ద చేస్తుంది నారాయణమ్మ. చదువుకోని పెద్ద మనవడు (మోహన్‌బాబు)కు బాగా చదువుకున్న దేవి (గీత)ని, బాగా చదువుకున్న చిన్న మనవడు (చిరంజీవి)కి పల్లెటూరు అమ్మాయి లలితాంబ (రాధిక)ను ఇచ్చి పెళ్లి చేస్తుంది. అయితే పల్లెటూరి జీవితం నచ్చక భార్యలిద్దరూ పట్నానికి వెళ్దామని భర్తలను ఇబ్బంది పెడతారు. కానీ అందుకు వారు ఒప్పుకోరు. దీంతో ఇంట్లో చెప్పకుండానే వెళ్లిపోయిన దేవి, లలితకు ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు? అనేదే ఈ సినిమా కథాంశం. దాదాపు 280 రోజుల పాటు ఈ చిత్రం థియేటర్లలో ఆడింది.

కాగా, చిరంజీవి - మోహన్‌ బాబు కలిసి కొదమ సింహం, చక్రవర్తి, కిరాయి రౌడీలు, శ్రీరామ బంటు, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ విశేష ఆదరణ దక్కించుకున్నాయి.

'ఆ రెండింటికి ఎటువంటి సంబంధం ఉండదు!' - పవన్ కల్యాణ్​పై 'సలార్' భామ వైరల్ కామెంట్స్​

విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఖాతాలో అరుదైన ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.