ETV Bharat / state

కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దు : హైకోర్టు - HC ON KTR FORMULA E CAR RACING CASE

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు - కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దన్న హైకోర్టు - దర్యాప్తు చేసుకునేందుకు అనుమతి

Telangana High court On KTR PETITION
Telangana High court On KTR PETITION (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 2 hours ago

Telangana High court On KTR PETITION : బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో సంబంధించి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తనపై నమోదు చేసినటువంటి ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో వాదనలను వినిపించారు.

ఈ నెల 30 వరకు కేటీఆర్​ను అరెస్టు చేయొద్దు : బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టినటువంటి సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని హైకోర్టును కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంతకు ముందు ఏసీబీకి ఫిర్యాదు చేసే ముందు ప్రభుత్వం అంతర్గత విచారణ చేసిందని, వారి ఫిర్యాదు ఆధారంగా ఒక్కరోజులోనే ఏసీబీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఏసీబీ దర్యాప్తు అధికారి కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే ఒక్క రోజు తర్వాత కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. లలితా కుమారి & చరన్ సింగ్ కేసు ప్రకారం ఈ ఎఫ్ఐఆర్ నిలబడదని తెలిపారు. కేసుకు సంబంధించి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించాలని అప్పటి వరకుఅరెస్టు చేయకుండా... తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం కోర్టును కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసు - ఏ1గా కేటీఆర్‌

ఫార్మలా-ఈ రేస్​ కేసు - హైకోర్టులో కేటీఆర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.