ETV Bharat / health

టీనేజ్​లోనే గర్భం? ఈ వయసులో కాన్పు మంచిదేనా? డాక్టర్లు ఏం అంటున్నారంటే? - TEENAGE PREGNANCY RISKS

-యుక్త వయసులో గర్భం దాల్చడం వల్ల అనారోగ్యం -తల్లీతో పాటు బిడ్డకు అనేక ఇబ్బందులు ఉంటాయట!

Teenage Pregnancy Risks
Teenage Pregnancy Risks (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 20, 2024, 5:23 PM IST

Teenage Pregnancy Risks: బాల్య వివాహాలు, తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు.. ఇలా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు గర్భం దాల్చడానికి (టీన్‌ ప్రెగ్నెన్సీ) కారణాలు అవుతున్నాయి. అయితే టీనేజ్​లోనే గర్భధారణ వల్ల తల్లితో పాటు బిడ్డకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా బాల్య వివాహాల్ని నిర్మూలించాలని అంటున్నారు. దీంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యం, టీన్‌ ప్రెగ్నెన్సీ వంటి విషయాలపై చిన్నతనం నుంచే అమ్మాయిల్లో అవగాహన కలిగించాలని సలహా ఇస్తున్నారు.

టీన్‌ ప్రెగ్నెన్సీ అంటే?
13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని టీనేజ్ అంటారు. ఈ సమయంలో గర్భం ధరించిన అమ్మాయిల్ని టీన్‌ ప్రెగ్నెంట్’గా పరిగణిస్తారు. మన దేశంలో ఈ సమస్య కాస్త తీవ్రంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏటా సుమారు 1.6 కోట్ల మంది బాలికలు చిన్న వయసులోనే (15-19) తల్లులవుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

టీనేజ్​లో గర్భం దాల్చడం వల్ల చాలా శారీరక, మానసిక సిద్ధం కాకపోవడం వల్ల అనేక మార్పులు జరుగుతుంటాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ చెబుతున్నారు. ముఖ్యంగా గర్భాశయం లాంటి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సిద్ధం కాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంకా కొందరిలో అయితే, అబార్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొందరిలో ఇన్​ఫెక్షన్లు సోకి సైడ్ ఎఫెక్ట్ వస్తాయని తెలిపారు. ఇంకా పిండం ఎదుగుదల సరిగ్గా లేక మిస్ క్యారేజ్, నెలల నిండకుండానే ప్రసవం జరుగుతుందని వెల్లడిస్తున్నారు. కొందరిలో 9నెలల వచ్చి నొప్పులు వస్తున్నా.. కాన్పు ఆలస్యం అవతుందంటున్నారు.

టీనేజ్​లో చాలా మందిలో ఉండే రక్త హీనత, పోషకాహారం లోపం సమస్యలతో ప్రసవం సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. టీనేజ్​ ప్రెగ్నెన్సీ వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు టీనేజ్ ప్రెగ్నేన్సీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాత ప్రసవం వల్ల తల్లితో పాటు బిడ్డ సురక్షితమని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజుకో పెగ్గు ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

మీ పిల్లలు బక్కగా ఉన్నారా? సరిగ్గా తిన్నా తగినంత బరువు పెరగట్లేదా? కారణాలు ఇవేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.