ETV Bharat / state

ప్రేమ గురించి తప్ప ఇతర పాటలు సినిమాల్లో ఉండట్లేదు : రైటర్ అనంత శ్రీరామ్‌ - WRITER ANANTHA SRIRAM

సినిమా పాటల విషయంలో పోకడ మారాల్సిన అవసరం ఉందన్న అనంత​ శ్రీరామ్ - 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో గురువుపై అద్భుతమైన పాట రాసినట్లు వెల్లడి

SONGS IN NOW A DAYS MOVIES
WRITER ANANTHA SRIRAM (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 10:17 PM IST

Lyric Writer Anantha SriRam : ప్రేమ గురించి తప్ప ఇతర ఏ పాటలు ప్రస్తుత చిత్రాల్లో ఉండట్లేదని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమా పాటల విషయంలో పోకడ మారాల్సిన అవసరం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో జరిగిన 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అనంత శ్రీరామ్​ పాల్గొని మాట్లాడారు. సినిమాల కోసం కాకుండా అప్పుడప్పుడు తన సంతృప్తి కోసం కొన్ని పాటలు రాసుకుంటానని ఆయన వెల్లడించారు.

పెద్ద సినిమాలైతే కండిషన్స్​? : సినిమా పాటలు రాస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట అసంతృప్తి ఉంటుందని అనంత శ్రీరామ్​ అన్నారు. అది పెద్ద సినిమా అయితే హీరో పరిచయ గీతం, హీరోయిన్‌ హీరోను చూసినప్పుడు వచ్చే ఓ ప్రేమ పాట, హీరో హీరోయిన్‌కి ప్రేమ కుదిరినప్పుడు వచ్చే ఒక యుగళగీతం, రెండో అర్ధ భాగంలో హీరో పోరాటానికి వెళ్తున్నప్పుడు నువ్వు సింహం, పులి అని పొగిడే పాట, ఆ తర్వాత సినిమాకి ఒక ఆట విడుపు ఇవ్వాలి కాబట్టి, ఐటమ్‌ సాంగ్‌ ఆఖర్లో అంతా సంతోషం వైపు పయనిస్తున్నామని హీరో, హీరోయిన్లు నిర్ణయించుకుంటున్నప్పుడు వచ్చే ఉత్సాహభరితమైన పాటతో రాయాల్సివస్తుందని అనంత శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశారు.

సంక్రాంతికి వస్తున్నాం : ఈ సూత్రంతోనే పెద్ద సినిమాలు నడుస్తున్నాయని, చిన్న సినిమాలైతే ప్రేమ పుట్టినప్పుడు, వికసించినప్పుడు, ప్రేమ భగ్నమైనప్పుడు, మళ్లీ కలుసుకున్నప్పుడు వచ్చే పాటలు తప్పితే ఇంతకు మించిన సన్నివేశాల సృష్టి జరగట్లేదని శ్రీరామ్​ అన్నారు. అదృష్టవశాత్తు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న అనిల్​ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో గురువుపై అద్భుతమైన పాట రాసే అవకాశం లభించిందన్నారు. త్వరలో మీరు కూడా ఆ పాటను వింటారని అనంత శ్రీరామ్​ తెలిపారు.

సముద్రంపై పాట : అంతర్వేది వద్ద గోదావరి సముద్రంలో కలుస్తున్నప్పుడు, కృష్ణానది హంసలదీవి వద్ద సముద్రంలో కలిసే ప్రాంతాన్ని చూస్తే T ఆకారంలో కనిపిస్తుందని, ఆ అద్భుత దృశ్యాన్ని చూసినప్పుడు పాట రాయాలనిపించి "ఎన్ని నదులు కలిస్తే ఎన్నెన్ని నదులు కలిస్తే ఏ లాభం. కడలిలో ఉప్పదనం కాస్త కూడా తగ్గనప్పుడు. ఎన్ని నదులు కలిస్తే ఏం లాభం. ఎన్నెన్ని గుడులు వెలిస్తే ఏ లాభం" అంటూ తాను రాసినట్లు ఆ పాటను సభలో ఉన్నవారికి శ్రీరామ్​ వినిపించారు. ఆయన ఆలపించిన గేయాలను సభికులను అలరించడంతో పాటు ఆలోచించే పరిస్థితి వైపు మళ్లించాయి.

Singer Anantha sriram at Bapatla : 'ప్రేక్షకుల మదిలో పాట నానితే గొప్ప పురస్కారమే..!'

ఓ మెలోడీ పాటను రాసిన ఇద్దరు రచయితలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.