Hyderabad Numaish 2025 postponed : ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేటువంటి 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల(నుమాయిష్)కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్ ప్రదర్శనశాల ప్రారంభతేదీ వాయిదా పడినట్లుగా నిర్వాహకులు తెలిపారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సినటువంటి ఈ కార్యక్రమం 3వ తేదీకి వాయిదా పడింది. వచ్చే నెల 2వ(జనవరి) తేదీ వరకు ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించినట్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. జనవరి 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని వివరించారు.
45 రోజుల పాటు జరగనున్న నుమాయిష్ : దాదాపు 45 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ నుమాయిష్ ప్రదర్శనకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 1938లో నిజాం కాలంలో మొదలయినటువంటి నుమాయిష్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి సందర్శకులు ఇక్కడకు వస్తారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ గాంధీభవన్, గోషామహల్ గేట్‌లను, అజంతా, అందుబాటులో ఉంచింది.
సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు సందర్శకులు మైదానంలో తిరిగేందుకు నిర్వాహకులు రోడ్లను ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్ డ్రై ఫ్రూట్స్, ఉత్తరప్రదేశ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్‌ను అందుబాటులో ఉంటాయి. 46 రోజుల పాటు జరగనున్న ఈ నుమాయిష్ ప్రదర్శనకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.
షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్ @ నుమాయిష్ - ఈ విషయాలు తెలుసుకోండి
నాంపల్లిలో సందడిగా సాగుతున్న నుమాయిష్ - ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్