Venkatesh Sankranthiki Vasthunam : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. తాజాగా హీరో వెంకటేశ్‌ను మూవీటీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ (చంటి), మీనాక్షి చౌదరి (బొబ్బిలి రాజా), దర్శకుడు అనిల్ రావిపూడి (జయం మనదేరాలో మహదేవనాయుడు), నిర్మాత దిల్ రాజు (ఘర్షణలో రామచంద్ర) వెంకటేశ్ సినిమాల్లోని ఐకాన్ పాత్రల గెటప్స్‌లో సందడి చేశారు. ఈ పాత్రల్లోనే వాళ్లు వెంకటేశ్‌ను పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే 'భాగ్యం (ఐశ్వర్య) లేదా మీనాక్షి (మీనాక్షి చౌదరి) ఎవరు బాగా యాక్ట్ చేశారు?' అని దర్శకుడు అనిల్ అడగ్గా, ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే నాకు టెన్షన్ వస్తుంది' అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు.
కాగా, ఈ సినిమా గురించి వెంకటేశ్ మాట్లాడారు. మూవీ ఆడియెన్స్‌కు కచ్చితంగా నచ్చుతుందని, దీనిపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు ఆయన తెలిపారు. 'గతంలో నేను ఎన్నో కామెడీ జానర్ చిత్రాల్లో యాక్ట్ చేశా. కానీ ఇది చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అని వెంకటేశ్ అన్నారు. ఇక ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ గురించి కూడా వెంకీ మాట్లాడారు. పొంగల్ బరిలో ఉన్న అన్ని సినిమాలు విజయాన్ని అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇక సినిమా విషయానికొస్తే, 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' తర్వాత హీరో వెంకటేశ్ - దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించారు. బీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
18 ఏళ్ల తర్వాత హిట్ కాంబో - స్పెషల్ అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
'సంక్రాంతికి వస్తున్నాం' అంటున్న వెంకీ మామ - ఇంట్రెస్టింగ్గా మూవీ టైటిల్!