Rishabh Pant Fastest Fifty Record : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్‌తో దూసుకెళ్లాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 61 రన్స్ స్కోర్ చేశాడు. టీమ్ఇండియాను తన స్కోర్‌తో ఆదుకున్నాడు. అయితే ఈ స్కోర్ ద్వారా పంత్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన రెండవ భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. మొదటి స్థానంలో కూడా పంత్ ఉండటం విశేషం.
టెస్టుల్లో వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్లు వీరే :
1. రిషబ్ పంత్ - 28 బాల్స్ (శ్రీలంకపై 2022)
2. రిషబ్ పంత్ - 29 బాల్స్ (ఆస్ట్రేలియా, సిడ్నీ 2025)
3. కపిల్ దేవ్ - 30 బాల్స్ (పాకిస్థాన్, 1982)
4. శార్దూల్ థాకూర్ - 31 (ఇంగ్లాండ్, 2021)
5. యశస్వి జైస్వాల్ - 31 (బంగ్లాదేశ్, 2024)
మ్యాచ్ హైలైట్స్ ఇవే :
క్రీజులో రవీంద్ర జడేజా(8*)తో పాటు వాషింగ్టన్ సుందర్(6*) ఉన్నారు. అయితే పంత్ మినహా ఇప్పటి వరకూ ఆడిన బ్యాటర్లలో ఎవ్వరూ మెరుగైన స్కోర్ చేయలేకపోయారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 32 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులను చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లతో చేలరేగిపోగా, ప్యాట్ కమిన్స్ , బ్యూ వెబెస్టర్ చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
అంతకుముందు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జోరులో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) తొలి ఓవర్‌లోనే నాలుగు ఫోర్లు కొట్టాడు. అదీనూ స్టార్క్ వేసిన ఓవరే కావడం విశేషం. అయితే ఆరంభంలో ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్ (13) బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. వీరిద్దరూ ఏడు ఓవర్లలోనే 42 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నిర్మించారు. అయితే, బోలాండ్ స్వల్ప వ్యవధిలో చెలరేగి ఓపెనర్లను పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (6) తన ఆఫ్‌సైడ్ బలహీనతతో వికెట్ కోల్పోయాడు. శుభ్‌మన్ గిల్ (13) వేగంగా ఆడేందుకు ప్రయత్నించి అనూహ్యంగా ఔట్ అయ్యాడు.
ఓపెనింగ్ అదిరింది! - తొలి ఓవర్‌లోనే 16 రన్స్! - ఆ ఘనత అందుకున్న తొలి బ్యాటర్ ఇతడే!
నేను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలనేది వాళ్లు నిర్ణయించలేరు : రోహిత్ శర్మ