ETV Bharat / state

రైల్వేలో 32,000 గ్రూప్​-డి జాబ్స్​ - ఇలా దరఖాస్తు చేసుకోండి - చివరి తేదీ ఎప్పుడంటే? - RRB GROUP D RECRUITMENT 2024

రైల్వే శాఖలో గ్రూప్​-డి ఖాళీల భర్తీకి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన ఆర్​ఆర్​బీ - అర్హత, దరఖాస్తు విధానం, చివరితేదీ తదితర వివరాలు మీ కోసం

RRB Group D recruitment 2024
RRB Group D recruitment 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 5:25 PM IST

RRB Group D Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్​-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్​-1 పోస్టులకు సంబంధించిన సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు జారీ చేసింది.

సంక్షిప్త ఉద్యోగ ప్రకటనలో ఉన్న పోస్టుల వివరాలివే

  • పాయింట్స్​మన్​
  • అసిస్టెంట్
  • ట్రాక్​ మెయింటెయినర్
  • అసిస్టెంట్​ లోకోషెడ్
  • అసిస్టెంట్​ ఆపరేషన్స్​

తదితర ఖాళీలు ఉన్నాయి.

  1. అర్హత : పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
  2. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
  3. దరఖాస్తు విధానం : ఆన్​లైన్​
  4. ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ : జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి22న ముగుస్తుంది.
  5. ఆర్​ఆర్​బీ రీజియన్లు : అహ్మదాబాద్​, బెంగళూరు, అజ్​మేర్, భువనేశ్వర్, భోపాల్​, బిలాస్​పూర్, చండీగఢ్, చైన్నై, గోరక్​పూర్, కోల్​కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్​రాజ్, రాంచీ, సికింద్రాబాద్​.
  6. ప్రకటన వివరాలు : లెవల్​-1 గ్రూప్​-డి : 32,000 ఖాళీలు (సుమారు)
  7. పోస్టులు : ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్‌మన్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి.
  8. ఏయే విభాగాల్లోనంటే : ఇంజినీరింగ్, ట్రాఫిక్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి.
  9. వయోపరిమితి(Age limit) : 01-07-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనలననుసరించి ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
  10. ప్రారంభ వేతనం : నెలకు 18వేల రూపాయలు
  11. ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (కంప్యూటర్​ బేస్​డ్​ టెస్ట్​), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​), డాక్యుమెంట్ వెరిఫికేషన్(సర్టిఫికెట్​ వెరిఫికేషన్), మెడికల్ ఎగ్జామినేషన్(మెడికల్​ టెస్ట్​) తదితరాల ఆధారంగా.
  12. అప్లికేషన్ ఫీజు : ఈడబ్ల్యూఎస్‌, జనరల్, ఓబీసీ కేటగిరీ, అభ్యర్థుల్కు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు రూ.250.

ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : 28-12-24
  • ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణ​ ప్రారంభం : 23.01.2025
  • ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 22-2-2025

ముఖ్యగమనిక : పోస్టుల వారీ ఖాళీలు, ఎంపిక విధానం, సిలబస్​ తదితర వివరాలను రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్​ త్వరలో విడుదల చేయనుంది.

రైల్వే మెగా ఎగ్జామ్​ - 18,799 ALP పోస్టుల భర్తీ కోసం - 22.5 లక్షల మంది అభ్యర్థులకు స్క్రీనింగ్​

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్ - డిగ్రీ అర్హతతో SBIలో 13,735 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.