ETV Bharat / spiritual

ఆ రాశివారు కష్టపడి పనిచేస్తే విజయం గ్యారెంటీ - గణపతి ప్రార్థన శుభప్రదం! - HOROSCOPE TODAY

2024 డిసెంబర్​ 30వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 4:00 AM IST

Horoscope Today December 30th, 2024 : డిసెంబర్​ 30వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పనుల్లో ఆలస్యం జరగవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఈ రోజు ఈ రాశి వారు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మీ కోపం కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన పనులను వాయిదా వేస్తే మంచిది. ప్రయాణంలో ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. ఆదాయం పెరగడం సంతృప్తినిస్తుంది. స్నేహితులతో , కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంది. కీర్తి పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా రచయితలకు ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. సృజనాత్మకతతో చేసే రచనలు మీకు సమాజంలో మంచి పేరు తెచ్చి పెడతాయి. ప్రియమైనవారిని కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనారోగ్యం పనులకు ఆటంకం కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు చాలా అవకాశం ఉంది. మీ తల్లిగారి అనారోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా అనుకూలం లేదు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. స్థానచలనం జరిగే సూచన కూడా ఉంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళ్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. గణపతి ప్రార్థన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలి. మీ దురుసు ప్రవర్తనతో మీరు ఈ రోజు ఒకరిని బాధించవచ్చు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్తారు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం వుంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. అవసరానికి సహాయం చేసే వారుంటారు. ఆధ్యాత్మికమైన విషయాలపై దృష్టి సారిస్తారు. ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన విషయాల్లో శ్రద్ద వహించండి. అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అభయ ఆంజనేయ స్వామి దర్శనంతో ఆపదలు తొలగుతాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. కష్టపడి పనిచేసి అభివృద్ధికి బాటలు వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. వ్యాపారంలో నష్ట భయం ఉంది. ప్రయాణాలు అనుకూలం కాదు. పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. శివారాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. అదృష్టం వరించి సంపదలు చేకూరుతాయి. కుటుంబంలో వేడుకలు, వినోదాలతో సందడిగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీరామాలయం సందర్శన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.