Horoscope Today December 19th 2024 : డిసెంబర్ 19వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదురయ్యే కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మనశ్శాంతినిస్తుంది. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. ఏ పని చేసిన ఆచితూచి ముందడుగు వేయాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. దుర్గాధ్యానం మేలు చేస్తుంది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా విశేషమైన పురోగతి ఉంటుంది. ఇది ఈ రోజు మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. అందుకే ప్రశాంతంగా ఉంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీ, సవాళ్లు ఉండవచ్చు. మనోబలంతో సవాళ్లను అధిగమిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తిపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని ఊహించని ఘటనలు ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఇన్నిరోజుల ఎదురుచూపులకు ముగింపు పలికే తరుణం వచ్చింది. ఈ రోజు మీకు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఊహించని సంపద కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మంచి మనసుతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. మీ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఉరకలెత్తించే సంతోషం ఇంటిని ఉత్సాహభరితంగా మార్చుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పని ప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. ఇతరుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా ఊహించని ఘటనలతో ఈ రోజంతా తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బంధువుల నుంచి శుభ వర్తమానం అందుతుంది. ధనలాభం ఉండవచ్చు. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. అభయ ఆంజనేయస్వామి ప్రార్ధన శుభకరం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు విశేషమైన యోగం కలుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పెంచుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు భారీ లాభాలను అందుకుంటారు. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు అన్ని రంగాల్లో విజయాన్ని చూస్తారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ధనలాభాలు సమృద్ధిగా ఉండడం వల్ల ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉంది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శ్రీ నృసింహ స్వామి దర్శనం శుభకరం.