ETV Bharat / health

ఈ మహిళలకు నిద్రలేమి, దంత సమస్యలు కూడా! - ఇలా చేయాలట! - DENTAL PROBLEMS IN MENOPAUSE

- పలు చిట్కాలు పాటించాలంటున్న నిపుణులు - ఈ జాగ్రత్తలు పాటించాలని సూచన

How to Cure Dental Problems in Menopause
Dental Problems in Menopause (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

How to Reduce Dental Problems in Menopause: మహిళల్లో మెనోపాజ్ దశ కాస్త కఠినంగా ఉంటుంది. అయితే గతంలో 55 ఏళ్లు దాటిన వారిలోనే ఇది కనిపిచేంది. కానీ.. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది 40 ఏళ్లలోనే ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ దశలో రుతుక్రమం ఆగిపోతుంది. ఫలితంగా మహిళలను అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అలాంటి వాటిల్లో.. ఒంట్లో వేడి ఆవిర్లు, అరికాళ్లలో మంటలు, చెమటలు పట్టడం, నిద్రలేమి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ దశలో నోటి సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాలూ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

శరీరంలో ఈస్ట్రోజన్‌ స్థాయులు తగ్గడం వల్ల లాలాజల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా నోరు పొడిబారటం (జీరోస్టోమియా), గమ్‌ ఇన్‌ఫెక్షన్లు (పెరియోడాంటల్‌) వచ్చే ముప్పు ఎక్కువని అంటున్నారు. నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ సభ్యుల బృందం కూడా ఇదే విషయాన్ని ఓ అధ్యయనంలో స్పష్టం చేసింది(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). ఫలితంగా కావిటీస్, చిగుళ్ల వాపు, దవడ ఎముకలు బలహీన పడటం, రుచి తెలియకపోవడం, దంత క్షయం లాంటి సమస్యలూ మొదలవుతాయంటున్నారు. మెనోపాజ్‌ దశకు చేరుకున్న 50 శాతం మహిళల్లో ఈ లక్షణాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 60 దాటిన వారిలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఎలా అధిగమించాలంటే..

  • ఈ దశలో దంత సమస్యలను అధిగమించాలంటే.. ఫ్లోరైడ్‌ కలిగిన టూత్‌పేస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఫ్లోరైడ్​ కలిగిన పేస్ట్​ వాడటం వల్ల చిగుళ్లు, గమ్‌ సంబంధిత సమస్యలు తగ్గుతాయంటున్నారు..
  • రోజుకు రెండు సార్లు బ్రష్​ చేయడం మంచిదంటున్నారు. అలాగే రోజుకొక్కసారైనా గోరువెచ్చని నీటితో పుక్కిలించాలని చెబుతున్నారు.
  • కాల్షియం, విటమిన్‌ డి అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆహారాలు ఎముకలు, దవడల ఆరోగ్యానికి ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. అంటే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బీన్స్​, గింజలు, సోయా ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, పండ్లు వంటివన్నీ క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.
  • మెనోపాజ్​లో దంత సమస్యలను తగ్గించడానికి నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రుళ్లూ హైడ్రేటెడ్‌గా ఉండటానికి హ్యుమిడిఫైయిర్లు వినియోగిస్తే మంచిదంటున్నారు. ఇవన్నీ చేస్తూ క్రమం తప్పకుండా డెంటల్‌ చెకప్స్‌కు వెళుతుండాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఒంట్లో నుంచి వేడిఆవిరి, చెమట, అరికాళల్లో మంటలా? - కారణం అదేనట, ఇలా చేయండి!

మహిళలూ నలభై దాటాక పొట్ట పెరుగుతోందా? - డైలీ ఈ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది!

40 ఏళ్లు దాటితే.. శృంగారంపై ఆసక్తి తగ్గుతుందా? పిల్లలు పుట్టరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.