తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి ఈరోజు పెళ్లి కుదిరే ఛాన్స్ - శివారాధన శ్రేయస్కరం! - DAILY HOROSCOPE

అక్టోబర్ 16వ తేదీ (బుధవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 4:58 AM IST

Horoscope Today 16th October 2024 : 2024 అక్టోబర్ 16వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్యం కారణంగా పనుల్లో శ్రద్ధ పెట్టలేకపోతారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. నూతన ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. పొదుపునకు సంబంధించి మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి అనువైన సమయం. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలలో అధికారం, గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. స్థానచలనం సూచన కూడా ఉంది. వ్యాపారులు పెద్ద ప్రాజెక్టును అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రభుత్వపరంగా రావాల్సిన బకాయిలు అందుతాయి. ఈ సమయంలో వాణిజ్యంలో చేసే లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరంగా నూతన అవకాశాలను అందుకుంటారు. అవివాహితులు అనుకూలమైన జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ రోజు ఆర్థికంగా విశేషమైన శుభఫలితాలు ఉండవచ్చు. ఆకస్మిక ధనలాభాన్ని అందుకుంటారు. స్నేహితులను కలవడం, పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడం వల్ల మీరోజు ఫలవంతం అవుతుంది. సంతానం నుంచి శుభవార్తను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో వారిని మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంట్లో జరగనున్న శుభకార్యానికి సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. గృహాలంకరణ కోసం ధనవ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నం అవుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. సన్నిహితులతో మాట్లాడే సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్న మీ ప్రియమైన వారి నుంచి శుభవార్తలు అందుకుంటారు. అన్ని రంగాల వారు లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి. పని ప్రదేశంలో కొంతమంది ప్రవర్తన కారణంగా మానసికంగా కలత చెందుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా పరిస్థితులు మెరుగు పడటం వల్ల సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, కుటుంబపరంగా సానుకూల ఫలితాలు ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభాలు ఉండవచ్చు. కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపార భాగస్వాములతో, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లి అద్భుతమైన విజయాలను అందుకుంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుంటారు. వృత్తి పరంగా, వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నష్ట నివారణ చర్యలు చేపడతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ముఖ్యమైన పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన చర్యలు చేపడతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తీవ్రమైన పనిభారంతో ఒత్తిడికి లోనవుతారు. బద్దకం, నిర్లక్ష్యాన్ని వీడి లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పని చేస్తే విజయం ఉంటుంది. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్ధికంగా కూడా నష్టపోయే సూచన ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పఠిస్తే శుభం జరుగుతుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి పెంచుకునే విషయంపై దృష్టి సారిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన పర్యటనకు అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉండవచ్చు. పదోన్నతులు ఉంటాయి. మీ పోటీదారులను అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ప్రాధాన్య క్రమంలో అవసరాలను నిర్ణయించుకుని ఖర్చు పెడితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. సంయమనం పాటించడం ద్వారా పొదుపుకు బాటలు వేసుకోగలుగుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. సహనం పాటించడం అవసరం. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోడానికి మీ మాటలను అదుపులో పెట్టుకోని కోపాన్ని దూరం చేయండి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. వాదనలు, ప్రతికూల ఆలోచనలు మానుకోండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అవసరం. ఇష్ట దేవత ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details