Hanuman Jayanti Telugu 2024 : హిందువులు వైభవంగా జరుపుకునే ఉత్సవాల్లో 'హనుమాన్ జయంతి' ఒకటి. ఏటా చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. అయితే.. పురాణాల ప్రకారం ఆ పవన పుత్రుడు మంగళవారం జన్మించాడని పండితులు చెబుతారు. ఈ సారి మంగళవారం హనుమాన్ జయంతి రావడంతో ఈ పండుగ ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తున్నారు. మరి.. ఆంజనేయస్వామి అనుగ్రహం ఉండాలంటే భక్తులు ఆ రోజున భక్తులు ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని నిర్వహిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి రోజున వేడుకలనుజరుపుకుంటారు. అయితే.. హనుమాన్ జయంతి రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉండటం వల్ల ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయని పండితులు చెబుతున్నారు.
హనుమాన్ జయంతి రోజున ఇలా చేయండి :
- సూర్యోదయాని కంటే ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి.
- వీలైతే నారింజ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి, దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్లాలి.
- అలాగే ఈ రోజున ఆ స్వామి వారికి సువాసన కలిగిన నూనె, సింధూరాన్ని అర్పించాలి.
- ఆలయంలో హనుమాన్ చాలీసాతో పాటు భజరంగీ మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి.