ETV Bharat / spiritual

వసంత పంచమి రోజే నాలుగో రాజ​ స్నానం- కుంభమేళాలో శాస్త్రోక్తంగా ఎలా ఆచారించాలో తెలుసా? - MAHA KUMBH 2025

మహా కుంభమేళాలో నాలుగో రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి? విశేషమైన ఫలితాల కోసం ఎలాంటి దానాలు చేయాలో మీ కోసం!

Maha kumbh 2025 Fourth Raja Snanam
Maha kumbh 2025 Fourth Raja Snanam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 4:41 AM IST

Maha kumbh 2025 Fourth Raja Snanam : భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధాత్మిక ఉత్సవం మహా కుంభమేళా ప్రయాగజ్‌లో ప్రారంభం అయింది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి భక్తులు నదీ స్నానం చేయడానికి భక్తి, విశ్వాసాలతో ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహా కుంభ మేళాలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే నాలుగవ రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి, శాస్త్రోక్తంగా స్నానం చేసే విధి విధానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మొత్తం ఆరు రాజ స్నానాలు
మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరుగనున్నాయి. ఇవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి రోజు జరుగనున్నాయి.

వసంత పంచమి - నాలుగో రాజ స్నానం
మహా కుంభమేళాలో నాలుగో రాజస్నానం పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున జరుగనుంది. ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా ఆ రోజు నాల్గోవ రాజ స్నానం చేయడానికి సాయంత్రం 5.23 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది. ఈ శుభ ముహూర్తం సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది.

వసంత పంచమి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ప్రార్థన వల్ల సరస్వతి దేవి ఆవిర్భవించిందని చెబుతారు. సరస్వతి దేవి వాక్కు, సంగీతం,జ్ఞానానికి అధిష్టాన దేవత అని నమ్ముతారు. వసంత పంచమి నుంచి వసంతకాలం ప్రారంభమవుతుంది.

శాస్త్రోక్తంగా రాజ స్నానం చేయాల్సిన విధి
మహా కుంభ మేళాలో రాజ స్నానం చేసే వారు ముందుగా నదీమతల్లికి నమస్కరించుకుని నది ఒడ్డు నుంచి కొంత మట్టిని సేకరించి నదికి నమస్కరిస్తూ నదిలోకి ప్రవేశించాలి. సేకరించిన మట్టిని నదిలో కలపాలి. భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకొని మూడు సార్లు నదిలో మునగాలి. తరువాత దోసిలితో నీరు తీసుకొని తూర్పు తిరిగి సూర్యునికి అర్ధ్యం ఇవ్వాలి. తరువాత నది బయటకు వచ్చి నదిలోకి పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించాలి. అరటి దొన్నెలో ఉంచిన దీపాలు నదిలో వదిలి నమస్కరించుకోవాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీస్నానం పూర్తి చేసిన తరువాత నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది.

ఈ దానాలు అత్యంత శ్రేష్టం
వసంత పంచమి రోజు మహాకుంభమేళాలో నాలుగో రాజ స్నానం చేసిన తర్వాత చేసే దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సద్బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, ఛత్ర దానం, జలదానం, పాదరక్షలు దానం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. బహుశా రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి దానాలు చేయాలని పెద్దలు సూచించినట్లుగా భావించవచ్చు. రానున్న మహా కుంభమేళాలో వీలైతే మనం కూడా పాల్గొని రాజ స్నానం చేద్దాం. తరిద్దాం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మౌని అమావాస్య రోజే మూడో రాజ స్నానం- కుంభమేళాలో ఈ దానాలు చేస్తే విశేష ఫలితాలు ఖాయం!

మహా కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? 'రాజ' స్నానం చేస్తే అంత మంచిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.