Horoscope Today January 19th 2025 : 2025 జనవరి 19వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. మనోధైర్యంతో క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్థి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. దుర్గాస్తుతి పారాయణ ఉత్తమం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ రంగాల వారికి విశేషంగా యోగిస్తుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి పరంగా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. కీలక వ్యవహారాల్లో మీదే తుది నిర్ణయం అవుతుంది. కుటుంబంలో సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయడం వల్ల మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అస్థిరబుద్ధితో ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలమైన సమయం. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తి ఉద్యోగాలలో వినయ విధేయతలతో ఉంటే సానుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కలహాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధనతో సత్ఫలితాలు ఉంటాయి.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రసంశలు అందుకుంటారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ కీలకమైన పనిలో విజయం సాధిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. బంధువులతో అనవసరంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఖర్చులు విపరీతంగా పెరిగే సూచన ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మనోబలంతో ఓ క్లిష్టమైన పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. గొప్పవారి పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మీ పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దృఢమైన పట్టుదలతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదోన్నతి వచ్చే అదృష్టం వుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశముంది. ఉద్యోగంలో పనిభారం పెరగకుండా చూసుకోండి. స్థానచలనం ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు, ఒత్తిడి వుండే అవకాశం వుంది. ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శివాష్టకం పఠించడం ఉత్తమం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోండి. కళాకారులు, రచయితలు నైపుణ్య ప్రదర్శనతో అందరినీ ఆకర్షిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పాత స్నేహితులను కలవడం సంతోషంగా కలిగిస్తుంది. నిరణ్యాలలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమం.