One Banana Sold for RS.100 in Hyderabad : సాధారణంగా అరటిపళ్లను డజన్ల లెక్కన అమ్ముతారు. వాటి ధర డజనుకు మహా అయితే ఓ రూ.60 నుంచి రూ.80 వరకు ఉంటుంది. కానీ ఒక అరటి పండు ధర రూ.100 అంటే నమ్ముతారా? భారత పర్యటనకు వచ్చిన హగ్ అనే ఓ రష్యన్ యాత్రికుడికి సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. తాన ఒక వ్లాగ్ చేస్తున్నప్పుడు రోడ్డుపైన తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, ఓ అరటి పండు ధర ఎంత అని అడిగాడు. అందుకు ఆయన రూ.100 అని సమాధానమిచ్చాడు.
ఆయన చెప్పింది తప్పుగా విన్నానేమో అనుకుని హగ్ మరోసారి అడిగినా అదే సమాధానం చెప్పాడు. ఒక అరటి పండు పట్టుకుని దాని ధర రూ.100 అని హగ్ అడగ్గా అవునని సమాధానం చెప్పాడు. ఆశ్చర్యపోయిన అతడు అంత ధర చెల్లించలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వ్లాగ్ను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఆ పోస్ట్ కాస్త వైరల్గా మారింది. ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఈ ఘటన హైదరాబాద్లోనే జరిగినట్లు తెలుస్తోంది.