These Mistakes to Avoid While Chanting Hanuman Chalisa :ఆంజనేయుడిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది హనుమాన్ చాలీసాను పఠిస్తుంటారు. దీనిలో మొత్తం నలభై శ్లోకాలు ఉంటాయి. తులసీదాస్ ఈ పద్య సంపుటిని రచించారు. దీన్ని పఠించడం వల్ల ఆంజనేయస్వామి అనుగ్రహం, బలం, రక్షణ, జ్ఞానం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే.. హనుమాన్ చాలీసా చదివినా, విన్నా అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
అయితే, మీరు అనుకున్న పనులన్నీ పూర్తి కావాలంటే హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) చదివేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈ పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల పుణ్యఫలం దక్కదని చెబుతున్నారు. ఇంతకీ, హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ టైమ్లో హనుమాన్ చాలీసా చదవండి :హనుమాన్ చాలీసాను పఠించడానికి బ్రహ్మ ముహూర్తం అనువైన సమయంగా చెబుతున్నారు పండితులు. అంటే.. తెల్లవారుజామున చదవాలి. ఎందుకంటే.. ఈ టైమ్ ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాన్ని ప్రారంభించడానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరింత పెరుగుతాయంటున్నారు పండితులు.
శుభ్రమైన బట్టలు ధరించండి : హనుమాన్ చాలీసా పఠించే ముందు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శుభ్రమైన వస్త్రధారణ సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. అలాగే ఇది మీ అభ్యాసానికి పవిత్రమైన, సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుందని పండితులు సూచిస్తున్నారు.
వేగంగా పూర్తి చేయడానికి తొందరపడొద్దు : చాలా మంది హనుమాన్ చాలీసా చదివేటప్పుడు వేగంగా పూర్తి చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాకాకుండా తగినంత సమయాన్ని వెచ్చించి తొందరపడకుండా నెమ్మదిగా చదవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు పండితులు.
శాపానికి ఉపశమనం- ఆంజనేయ స్వామి జననం- హనుమంతుడి జన్మ రహస్యం తెలుసా?