Festivals in February 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ నెలను మాఘ మాసం అని పిలుస్తారు. చలికి వీడ్కోలు పలికి వేసవి కాలానికి స్వాగతం పలికే మాసం ఇది. ఈ ఫిబ్రవరి నెలలో పండగలు తక్కువగా వచ్చినప్పటికీ.. వచ్చిన పండగల ప్రాముఖ్యత మాత్రం పెద్దదే. ఈ నెలలో వసంత పంచమి, రథసప్తమి, మాఘ పూర్ణిమతోపాటు అనేక పండుగలొచ్చాయి. ఆ వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
ఫిబ్రవరి 6: షట్టిల ఏకాదశి
ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం నాడు షట్టిల ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. షట్టిల ఏకాదశి రోజున నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయని పండితులు చెబుతారు. అలాగే నువ్వులను దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం.
ఫిబ్రవరి 7: ప్రదోష వ్రతం
షట్టిల ఏకాదశి మరునాడు అంటే ఫిబ్రవరి ఏడో తేదీన ప్రదోష వ్రతం ఉపవాస దీక్ష పాటిస్తారు. ఈ దీక్ష చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది ఆరోజున ఉపవాసం ఉంటారు.
ఈ వినాయక మంత్రాలు పఠిస్తే - అన్నింటా విజయం మీదే!
ఫిబ్రవరి 9 : మాఘ అమావాస్య, మౌని అమావాస్య
ఫిబ్రవరి మాసంలో 9వ తారీఖు శుక్రవారం రోజు వచ్చే ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ పర్వదినాన శివుడిని ఆరాధించడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున నదీ స్నానాలు చేయడం, దానధర్మాలు చేయడం వల్ల సుఖ శాంతులు లభిస్తాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా వివాహిత స్త్రీలు.. తమ భర్త, పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు.
ఫిబ్రవరి 13 : వినాయక చతుర్థి
సంకష్ట చతుర్థి కృష్ణ పక్షంలో జరుపుకుంటే.. వినాయక చతుర్థి శుక్ల పక్షంలో జరుపుకుంటారు. ఈ రోజున వినాయక అవతారాన్ని పూజిస్తారు.