ETV Bharat / spiritual

నూతన క్రాంతికి ఆహ్వానం పలికే తెలుగువారి 'సంక్రాంతి'- పేర్లు వేరైనా పండుగ ఒకటే! - MAKAR SANKRANTI 2025

మకర సంక్రాంతి విశిష్టత- పండుగ రోజు చేయాల్సిన ఏంటో మీ కోసం

Makar Sankranti 2025
Makar Sankranti 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2025, 3:02 PM IST

Makar Sankranti 2025 : తెలుగు వారి సంప్రదాయంలో పెద్ద పండుగ అంటే సంక్రాంతి. సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే పండుగ సంక్రాంతి. దేశవిదేశాల నుంచి తెలుగు వారు పల్లెకు చేరుకునే ఏకైక పండుగ సంక్రాంతి అంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా సంక్రాంతి విశిష్టత, పండుగ రోజు పాటించాల్సిన ఆచార వ్యవహారాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మకర సంక్రాంతి విశిష్టత
సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశి లోనికి ప్రవేశించినప్పుడు వచ్చే పండుగను మకర సంక్రమణం, మకర సంక్రాంతి అని అంటారు. తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా భోగభాగ్యాలతో, సిరిసంపదలను కురిపిస్తూ కొత్త కాంతులను వెదజల్లుతూ, కొత్త ధాన్యాలు ఇంటికి చేరుకుని వేళ ప్రతి ఇంటా ఎంతో శోభాయమానంగా జరుపుకునే పండుగ సంక్రాంతి.

సంక్రాంతి అంటే?
క్రాంతి అంటే వెలుగు అని అర్ధం. 'సం' అంటే చేరుకోవడం అని అర్థం. సంక్రాంతి అంటే వెలుగును చేరుకోవడానికి చేసే పయనం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈనాటి నుంచి చలిని పారద్రోలే వెచ్చని వెలుగు రేఖలు స్వాగతం పలుకుతాయి.

పండుగ రోజు తప్పకుండా చేయాల్సినవి
మకర సంక్రాంతి రోజు సూర్యోదయం ముందే నిద్ర లేచి నదీస్నానం ఆచరించాలి. ఆ రోజు చేసే నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అనంతరం ఇంటి ముంగిలితో ఆవుపేడ కలిపినా నీళ్లతో కళ్లాపి చల్లి, అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలను మామిడి ఆకులతో, పూలమాలతో అలంకరించాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని ఆవునేతితో దీపారాధన చేసి, పసుపు రంగు పూలతో ఇష్ట దైవాన్ని అర్చించాలి. కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లం, ఆవునెయ్యితో తయారుచేసిన పొంగలి ప్రసాదాన్ని దేవునికి నివేదించాలి.

శని ప్రీతి కోసం ఇలా చెయ్యాలి
పుష్య మాసానికి అధిపతి శనీశ్వరుడు. అంతేకాదు మకర రాశికి కూడా అధిపతి శని. అందుకే మకర సంక్రాంతి రోజున శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డులు, గుమ్మడికాయ దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల ఆరోగ్యం, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. ఈ రోజున పితృదేవతల పేరిట వస్త్రదానం కూడా చేస్తారు.

పితృ ప్రీతి తర్పణాలు
సంక్రాంతి రోజున చేసే పూజాపునస్కారాలకు , యజ్ఞయాగాదులకు విశేష ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు కూడా వదులుతారు. దక్షిణాదిన శుభ కార్యాలన్నీ సంక్రాంతి తరువాతనే ఆరంభిస్తారు. సంక్రాంతి పండుగ మనకు పెద్ద పండుగ. ఏడాది మొత్తం కష్టించి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం.

ధాన్యలక్ష్మికి ఆహ్వానం
పంటపొలాల నుంచి ఇంటికి చేరే ధాన్యలక్ష్మికి ఆహ్వానం పలకడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతారు. గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల సంకీర్తనలతో, కన్నె పడుచుల గొబ్బి పాటలతో, కొత్త అల్లుళ్ల సందళ్లతో ఊరు ఊరంతా సందడి గా మారుతుంది.

పేర్లు వేరైనా పండుగ ఒకటే!
నిజానికి సంక్రాంతి పండుగ యొక్క శోభను పలెటూళ్లలోనే చూడాలి. సంక్రాంతికి తెలుగునాట కోడి పందేలు ఎంతో గొప్పగా జరుగుతాయి. ఈ మకర సంక్రాంతిని తెలుగునాట సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, బంగాల్​లో తిల ప్రా సంక్రాంతి, పంజాబ్​లో లోహిడి, మహారాష్ట్రలో తిల్ సంక్రాతి అని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఎడ్ల పందాలు కూడా జరుగుతాయి.

పల్లె చేరే పట్టణం
సిరిసంపదలు బంధు మిత్రులతో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ ఉదేశ్యం. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డవారు కూడా సంక్రాంతి పండుగకు తమ సొంత ఊరుకు ప్రయాణమవుతారు. నగరాలు బోసిపోతాయి. సొంత ఊరు, కన్నతల్లి జీవితంలో మరపురానివి. అందుకే పండుగ పేరుతో సంవత్సరానికి ఒక్కసారైనా ఊరెళ్లి అందరినీ పలకరించి ఆనందంగా పండుగ జరుపుకొని ఆ అనుభూతులతో మిగిలిన ఏడాదంతా గడిపి మళ్లీ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడంలో ఉన్న ఆనందం ఇంకెందులోను ఉండదు.

ఈ విధంగా మనం పుట్టి పెరిగిన గ్రామాలను గుర్తుకు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. పండుగలు జరుపుకోవడమనే సంప్రదాయం వెనుక ఆరోగ్యం, పర్యావరణం, ఆధ్యాత్మిక అంశాలు ముడిపడి ఉంటాయి.ఈ సంక్రాంతిని మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. మన పిల్లలకు పండుగ విశిష్టతను తెలియజేద్దాం. మన సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు భద్రంగా అందిద్దాం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.