తెలంగాణ

telangana

ETV Bharat / politics

సర్జికల్ స్ట్రైక్​ ద్వారా పాక్​లో ఉగ్రవాదులను ఏరిపారేశాం - కాంగ్రెస్​కు అలా చేసే దమ్ముందా? : అమిత్​ షా - Amit Shah Election Campaign - AMIT SHAH ELECTION CAMPAIGN

Amit Shah Election Campaign in Telangana : కాంగ్రెస్​, మజ్లిస్​ను తరిమే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని, బీఆర్​ఎస్​కు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. సర్జికల్​ స్ట్రైక్స్​ చేసే ధైర్యం కాంగ్రెస్​ ప్రభుత్వానికి లేదని చెప్పారు. వికారాబాద్​లో నిర్వహించిన బీజేపీ జన సభలో అమిత్​ షా పాల్గొన్నారు.

Amit Shah Election Campaign in Telangana
Amit Shah Election Campaign in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 12:53 PM IST

Updated : May 11, 2024, 1:57 PM IST

Amit Shah Attend BJP Public Meeting in Vikarabad : సర్జికల్​ స్ట్రైక్స్​ గురించి రేవంత్​ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి అమిత్​ షా అన్నారు. సర్జికల్​ స్ట్రైక్స్​ చేసే ధైర్యం కాంగ్రెస్​ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. సర్జికల్​ స్ట్రైక్స్​ ద్వారా పాక్​లో ఉగ్రవాదులను ఏరిపారేశామని గుర్తు చేశారు. పాక్​ ఆక్రమిత ప్రాంతం భారత్​ అధీనంలోనే ఉంటుందన్నారు. బీజేపీ ఉన్నంత వరకు పీవోకేను పాక్​ వశం కాకుండా చూస్తుందని తెలిపారు. వికారాబాద్​లో నిర్వహించిన బీజేపీ జన సభలో అమిత్​ షా పాల్గొన్నారు.

కశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో అంతర్భాగంగానే ఉంటుందని కేంద్రమంత్రి అమిత్​ షా తెలిపారు. తెలంగాణ ప్రజలకు కశ్మీర్​తో పని ఏంటని రేవంత్​ రెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కశ్మీర్​ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడతారని స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని పారదోలడానికి మోదీ కృషి చేశారని వివరించారు. కాంగ్రెస్​ పార్టీ ఉగ్రవాదులను కాపాడుతూ వచ్చిందని ధ్వజమెత్తారు.

అయోధ్యలో రామమందిరం అంశాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్​ నాన్చుతూ వచ్చిందని కేంద్రమంత్రి అమిత్​ షా మండిపడ్డారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో రామమందిరం నిర్మించామని స్పష్టం చేశారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠలో కూడా కాంగ్రెస్​ నేతలు పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర ప్రాణప్రతిష్ఠకు రాలేదన్నారు.

మజ్లిస్​ ఓటు బ్యాంకుకు రేవంత్​ భయపడుతున్నారు : మజ్లిస్​ ఓటు బ్యాంకుకు రేవంత్​ రెడ్డి భయపడుతున్నారని కేంద్రమంత్రి అమిత్​ షా విమర్శించారు. బీజేపీ మాత్రం ఓటు బ్యాంకు కోసం ఎన్నడూ భయపడలేదని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏనాడు కృషి చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్​, మజ్లిస్​ను రాష్ట్రం నుంచి తరిమే శక్తి బీఆర్​ఎస్​కు లేదని చెప్పారు. ఆ రెండింటిని తరిమే శక్తి కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. బీజేపీకి 400 సీట్లు రిజర్వేషన్లు తొలగిస్తారని ఆ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.

బీజేపీ గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం : దేశ ప్రజలు పదేళ్లుగా బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారని కేంద్రమంత్రి అమిత్​ షా కొనియాడారు. బీజేపీ ఎన్నడూ రిజర్వేషన్లను తొలగించలేదని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారని ఆవేదన చెందారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారా రేవంత్​ రెడ్డి చెప్పాలని అన్నారు. బీజేపీను గెలిపిస్తే కచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. అబద్ధపు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్​ చూస్తుందని అమిత్​ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

"సర్జికల్​ స్ట్రైక్స్​ గురించి రేవంత్​ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారు. సర్జికల్​ స్ట్రైక్స్​ చేసే ధైర్యం కాంగ్రెస్​ ప్రభుత్వానికి లేదు. సర్జికల్​ స్ట్రైక్స్​ ద్వారా పాక్​లో ఉగ్రవాదులను ఏరిపారేశారు. పాక్​ ఆక్రమిత ప్రాంతం భారత్​ అధీనంలోనే ఉంటుంది. బీజేపీ ఉన్నంత వరకు పీవోకేను పాక్​ వశం కాకుండా చూస్తుంది. తెలంగాణ ప్రజలకు కశ్మీర్​తో పని ఏంటని రేవంత్​ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కశ్మీర్​ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడతారు. దేశంలో ఉగ్రవాదాన్ని పారదోలడానికి మోదీ కృషి చేశారు."- అమిత్​ షా, కేంద్రమంత్రి

సర్జికల్ స్ట్రైక్​ ద్వారా పాక్​లో ఉగ్రవాదులను ఏరిపారేశాం - కాంగ్రెస్​కు అలా చేసే దమ్ముందా? : అమిత్​ షా (ETV Bharat)

రాహుల్‌ పిల్ల చేష్టల హామీలు - మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి : అమిత్‌షా - AMIT SHAH BHUVANAGIRI MEETING NEWS

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ కాపాడుతుంది : అమిత్ షా - Amit Shah Secunderabad Meeting

Last Updated : May 11, 2024, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details