తెలంగాణ

telangana

ETV Bharat / politics

దిల్లీకి సీఎం రేవంత్​ రెడ్డి - మిగిలిన లోక్​సభ స్థానాలకు నేడు అభ్యర్థుల ప్రకటన! - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

‍‌Telangana ‍Congress MP Candidates 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో 14 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ, ఇవాళ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది.

Telangana Congress Parliament Election Incharges
‍‌Telangana ‍Congress MP Candidates 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 7:14 AM IST

మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు - నేడు నాలుగు లోక్‌సభ అభ్యర్థుల ఖరారు

Telangana ‍Congress MP Candidates 2024 :రాష్ట్రంలో మిగిలిన లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ ఉదయం దిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 17 నియోజకవర్గాలకు గానూ ఇప్పటికే 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నాలుగింట్లో వరంగల్‌ స్థానానికి కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. అందుకోసమే ఆదివారం కడియం శ్రీహరి పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

జాతీయ మేనిఫెస్టోలో తెలంగాణకు చెందిన అనేక అంశాలు : మంత్రి శ్రీధర్‌ బాబు - Congress National Manifesto 2024

Congress Appointed Parliament Incharges in Telangana : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పార్లమెంట్​ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జుల​ను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జులుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు తెలిపాయి. ఖమ్మం స్థానానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్‌, పెద్దపల్లి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావును నియమించారు.

హైదరాబాద్ స్థానానికి ఓబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ సంపత్ కుమార్, చేవెళ్ల వేంనరేందర్ రెడ్డిని నియమించారు. మల్కాజ్‌గిరి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కొండా సురేఖ , నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, జహీరాబాద్ దామోదర్ రాజనర్సింహలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగసభ గురించి సీఈసీ సమావేశంలో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Leaders Campaign 2024: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీనే లేదని బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌లతో గులాబీ పార్టీ ప్రతిష్ట మసకబారిందని బీజేపీని సైతం ప్రజలు నమ్మరని ధీమాతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ రిజల్ట్​​పై హై టెన్షన్​ - నువ్వా నేనా అన్నట్లు హస్తం, కారు పార్టీలు - Mahabubnagar MLC By Election 2024

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారాలు - ఎన్నికల తర్వాక బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్న నేతలు - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details