Positive Responce to TDP and Janasena Joint Manifesto :ఆంధ్రప్రదేశ్‌లోతెలుగుదేశం, జనసేన మేనిఫెస్టో సూపర్‌హిట్ కొట్టేలా ఉందన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అందలో అక్షరరూపమిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్నీ సమతుల్యం చేస్తూ రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు రూపొందించిన దార్శనిక పత్రంగా ప్రజలు భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడుతున్నారు.
మూడు పార్టీల్లోనూ ఉరకలేస్తోన్న ఉత్సాహం : ఉరకలేస్తోన్న వైఎస్సార్సీపీ ఐదేళ్ల అరాచక పాలనలో విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు, దెబ్బతిన్న వర్గాలకు భరోసానిచ్చేలా ఉందని చర్చించుకుంటున్నారు. జగన్ విడుదల చేసిన వైఎస్సార్సీపీ మేనిఫెస్టో తుస్సుమనగా తెలుగుదేశం- జనసేన కూటమి మేనిఫెస్టోతో మూడు పార్టీల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది.
AP Elections 2024 :తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుముకగా ఉన్న బీసీలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు విశేష ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ, భవిష్యత్‌కు భరోసానిస్తూ దీనిని రూపకల్పన చేశారు. జనసేన 'షణ్ముఖ వ్యూహాన్ని' మేళవించి టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ఇప్పటికే విశేషంగా ప్రజల ఆదరణ చూరగొనగా, ఇప్పుడు విడుదల చేసిన పూర్తిస్థాయి మేనిఫెస్టో మరింత సమగ్రంగా, సంపూర్ణంగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్ల ఖర్చు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం లాంటివి మేనిఫెస్టోలో ఉన్నాయి. బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10,000ల కోట్ల వ్యయం, రూ.5,000ల కోట్లతో ఆదరణ పథకం, చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000ల ఆర్థిక సాయం, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25,000ల వేతనం వంటి అనేక విశేష నిర్ణయాలను మేనిఫెస్టోలో ప్రకటించారు.
వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ వంటి చరిత్రాత్మక నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళ్లనున్నాయి. అలాగే ఇప్పటికే అందుకుంటున్న పింఛన్‌ను ఏప్రిల్ నుంచే రూ.4,000లకు పెంచడం ప్రజలకు మరింత దగ్గర చేయనుంది. ఇప్పటికే 66 లక్షల మంది పింఛన్‌దారులు ఉండగా 50 ఏళ్లకే పింఛన్ వర్తింపు ద్వారా మరి కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న కూటమి : దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ అమలు చేయని సంచలనాత్మక నిర్ణయం కూటమి తీసుకుంది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. ఇది ప్రజారోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. కుటుంబంలో ఏ ఒక్కరికైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఎంతో కుంగిపోతోంది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందడం లేదు. కానీ ఇప్పుడు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన ఆసుపత్రుల్లో వైద్యం పొందే అవకాశం దక్కనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే ఇక ప్రతి కుటుంబం ఆసుపత్రుల భయం లేకుండా హాయిగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవచ్చు.