Telangana Police Introduced QR Code For Police Behaviour : తమ పనితీరును స్వయంగా తెలుసుకుని మెరుగుపరుచుకోవాలి అనుకుంటోంది పోలీస్ శాఖ. అందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టింది. దీన్ని ఇటీవలే డీజీపీ జితేందర్ విడుదల చేశారు. ఇది అన్ని పోలీస్ స్టేన్లకు చేరింది. ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారులకు కనిపించే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై ఠాణాలో ఫిర్యాదు చేసిన తర్వాత వారికి అందుతున్న సేవలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అందులో వచ్చే ఫారంపై వివరాలు ఇవ్వాలి. ఇది నేరుగా హైదరాబాద్ డీజీ కార్యాలయానికి చేరుతుంది. ఎవరు సమాచారం ఇచ్చారు అన్నది సంబంధిత స్టేషన్లకు తెలియజేయరు.
అందులో మీరు ఏం చెప్పవచ్చంటే :
- ఫిర్యాదు చేసిన తర్వాత కేసు ఎలా నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశారా లేదా?
- ఎఫ్ఐఆర్ చేశారా? లేదా?
- పోలీసులు మాట్లాడిన తీరు ఎలా ఉంది?
- ట్రాఫిక్ చలాన్ల గురించి
- పాస్పోర్టు ధ్రువీకరణ ఏ స్థితిలో ఉంది?
- ఇతర సేవలు గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా?
క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి
- సెల్ఫోన్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి.
- ఓపెన్ వెబ్సైట్ అని ట్యాప్ షటర్ బటన్ రాగానే దానిపై ట్యాప్ చేయాలి.
- సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఫాం, పోలీసు శాఖల సేవలపై ప్రజల అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
- తెలుగు, ఆంగ్ల భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచిస్తుంది.
- భాష ఎంచుకున్న తర్వాత పేరు, సెల్ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, అభిప్రాయం, జిల్లా లేదా కమిషనరేట్ పేరు, పోలీస్ స్టేషన్ పేరు నమోదు చేయాలి.
- తర్వాత మీ అభిప్రాయాన్ని రాయాలి. అలా నింపిన ఫారాన్ని పంపించాలి.
అది ఫలితం ఇవ్వకపోవడం వల్ల : పోలీసు శాఖ పని తీసురు గతంలో థర్డ్ పార్టీ విచారణ ద్వారా తెలుసుకునేవారు. ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో కొందరికి హైదరాబాద్ నుంచి కాల్ చేసి వివరాలు సేకరించేవారు. ఇది అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రజలు తమ అభిప్రాయాలను ఇచ్చేందుకు కొత్తగా క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చారు.
మహిళతో దురుసు ప్రవర్తన - మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెండ్