తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 5:50 PM IST

ETV Bharat / politics

రాష్ట్రంలో వేలాది మంది ఫోన్‌లు ట్యాప్​ చేశారు - నిందితులు ఎంతటి వారైనా శిక్ష తప్పదు : పొంగులేటి - Lok Sabha Elections 2024

Ponguleti Srinivas Reddy on Phone Tapping : ఖమ్మం లోక్​సభ స్థానంలో కాంగ్రెస్​ పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టినా, అధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు తెలిసిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మంలో జరిగిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Khammam Congress Meeting Today
Minister Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy on Phone Tapping: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. విచారణ పూర్తి అయిన తర్వాత ప్రజల ముందుకు వివరాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో కాంగ్రెస్​ పార్టీ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం మొత్తం కాంగ్రెస్‌దే - హస్తం పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావు - LOK SABHA ELECTION 2024

Ponguleti Srinivas Reddy Election Campaign : ఖమ్మం లోక్​సభ స్థానంలో హస్తం పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరిని నియమించినా, భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు మంత్రి (Minister Ponguleti) సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల అండతోనే గెలుపొందామని గుర్తు చేశారు. అభ్యర్థిని ప్రకటించిన అనంతరం మరింత ఎక్కువగా ఈ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. తాము ఇచ్చిన గ్యారంటీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు పరుస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అప్పుల సాకు చూపి పథకాల్లో వెనకడుగు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో 76వేల దరఖాస్తులు పరిష్కరించాం : పొంగులేటి

"రాష్ట్రంలో వేలాది మంది ఫోన్‌లు ట్యాపింగ్‌ చేసి, పౌరుల స్వేచ్ఛను గత పాలకులు హరింపజేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. నాతోపాటు అనేక మంది ఫోన్‌లు ట్యాపింగ్‌ చేశారు. ఎవరి సహకారంతో ట్యాపింగ్‌ నిర్వహించారో, వారందరూ ప్రతిఫలం అనుభవించక తప్పదు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో వివరాలను ప్రజల ముందుకు తీసుకువస్తాం." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఎంతటి వారికైనా శిక్ష తప్పదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti on Phone Tapping Case : రాష్ట్రంలో కాంగ్రెస్​ వచ్చింది - కరవు వచ్చిందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. డిసెంబర్​ 9న కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని, అంతకు ముందే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని బదులిచ్చారు. నీటిని సక్రమంగా నిల్వ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రూ.లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​లో జరిగిన అవినీతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రూ.46 వేల కోట్ల నిధులతో మిషన్‌ భగీరథ (Mission Bhagiratha) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రతి గ్రామంలో శుద్ద జలాలు అందిస్తామని చెప్పి 60 శాతం కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే తాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ పాల్గొన్నారు.

రైతులపై కపట ప్రేమ చూపుతూ రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారు - బీఆర్​ఎస్ నేతల​పై పొంగులేటి ఫైర్ - Ponguleti fires on brs leaders

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే 'పవర్ షట్​ డౌన్'​ చేయాలని కుట్ర చేశారు : పొంగులేటి - Minister Ponguleti Chit Chat

ABOUT THE AUTHOR

...view details