PM Modi Letter to DK Aruna on Elections: ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ప్రజలు తమ ప్రతినిధిగా డీకే అరుణను ఆశీర్వదిస్తారనే నమ్ముతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో డీకే అరుణ పార్లమెంట్‌లో అడుగుపెడుతారనే నమ్మకం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు లేఖ రాశారు. తాను రాసిన లేఖ అరుణకు మంచి కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక జట్టుగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే తమ ప్రయాణంలో ప్రతి మెట్టును వదిలిపెట్టమని వివరించారు.
PM Modi Wishes to DK Aruna on Lok Sabha Elections: కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పరిపాలన మిగిల్చిన అనేక సమస్యల నుంచి దేశానికి విముక్తి కల్పించినట్లు ప్రధాని లేఖలో తెలిపారు. ఇప్పుడు ప్రతి దేశ పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చడంలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు కూడా నిర్లక్ష్యానికి, అవమానాలకు, అన్యాయానికి గురయ్యాయని ఆరోపించారు. మోదీ సదరు వర్గాల నుంచి అత్యధికంగా ప్రజాప్రతినిధులు ఎన్నికైన పార్టీ బీజేపీనేనని తెలిపారు. వేసవి తాపం అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
రేవంత్ రెడ్డికి నేను సాటి కానప్పుడు - నాపై విమర్శలు ఎందుకు?: డీకే అరుణ - DK ARUNA SLAMS CM REVANTH