తెలంగాణ

telangana

ETV Bharat / politics

వైఎస్సార్సీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు : పవన్ కల్యాణ్​ - Pawan Kalyan At Jayaho BC Meeting

Pawan Kalyan At Jayaho BC Meeting Today : వైఎస్సార్సీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ ఆరోపించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్‌ దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో పవన్ కల్యాణ్​ మాట్లాడారు.

Pawan Kalyan At Jayaho BC Meeting Today
Pawan Kalyan At Jayaho BC Meeting Today

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 7:38 PM IST

Updated : Mar 5, 2024, 9:43 PM IST

Pawan Kalyan At Jayaho BC Meeting Today : ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జగన్ లక్షల మంది బీసీ కార్మికుల పొట్ట కొట్టారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​ విమర్శించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్‌ దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టారని, బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.

Jayaho BC Meeting in Mangalagiri Today :బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లేదని, కుర్చీలు వేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. బడ్జెట్‌లో మూడో వంతు బీసీలకే అని చెప్పి పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారని ఆరోపించారు. ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు. బీసీలకు రక్షణ చట్టం అవసరమని, అందుకే మద్దతు తెలిపానని స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో పవన్ కల్యాణ్​ మాట్లాడారు.

బీసీలకు సాధికారత ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని పవన్ (Pawan Kalyan on BC Welfare) తెలిపారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలని పేర్కొన్నారు. సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బీసీలకు అండగా ఉంటామని అన్నారు. మత్స్యకారుల కోసం ప్రతి 30 కి.మీకు ఒక జెట్టీ ఉండాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల పిల్లలకు ఆదర్శ పాఠశాలలు నిర్మిస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

వైఎస్సార్సీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు పవన్ కల్యాణ్​

153 కులాల బీసీలకు జనసేన అండగా ఉంటుందf. రాష్ట్రంలో 53 శాతం జనాభా బీసీలే ఉన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. రామ్‌మనోహర్ లోహియాను ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో తగ్గించిన రిజర్వేషన్‌ను టీడీపీ- జనసేన అధికారంలోకి వచ్చాక పెంచుతాం. బీసీలకు సాధికారత ఉండాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తిని నేను. బీసీలకు రక్షణ చట్టం అవసరం. - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వడ్డెర కులస్థులకు ఆర్ధిక పరిపుష్టి కల్పించడంలో ప్రాధాన్యం ఇస్తుందని పవన్ వెల్లడించారు. బీసీ అన్ని కులాలకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీసీలపై దాడులు జరిగితే తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటామని పవన్ స్పష్టంచేశారు. బీసీలు ఐక్యంగా ఉండి తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. పల్లెకార్ల కులాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గంగవరం పోర్టు నిర్వాసితులు సహా అందరికీ న్యాయం చేస్తామని వివరించారు. బీసీల దగ్గర డబ్బు ఉండకూడదని జగన్ జీవోలు తెచ్చారని ఆక్షేపించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్

పీకే వ్యాఖ్యలతో జగన్​ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం

Last Updated : Mar 5, 2024, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details