Nizamabad MP Candidate Arvind Fires on Congress :దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ అన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ పదం ఎందుకు చేర్చాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఫిరోజ్ గాంధీ సమయంలో దేశాన్ని మూడు ముక్కలు చేశారన్నారు. ఈ విషయంపై తాను రెండేళ్ల క్రితం మాట్లాడిన వీడియోపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వీడియోను మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MP Arvind on SC, ST, OBC Reservation in Telangana : కాంగ్రెస్ హయాంలో యూనివర్సిటీల స్టేటస్లు తీసేసి మైనార్టీ కళాశాలగా మార్చారని అన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసి వారు విశ్వవిద్యాలయాల్లో చదవకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. 2011లో సోనియాగాంధీ మరొక జామియా మిలియా సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తీసేసి దానికి మైనారిటీ స్టేటస్ ఇచ్చి అందులో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజ్వరేషన్ తీసేసినట్లు తెలిపారు. దీన్ని పార్లమెంట్లో స్పెషల్ చట్టం ద్వారా అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో ఆ విశ్వవిద్యాలయంలో ఎవరూ చదవలేకపోయారని అన్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, హైదరాబాద్ యూనివర్సిటీల పరిస్థితి ఇలా కాదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.