రేవంత్‌కు నేనంటే ఎందుకంత కోపం? - మహిళ అనే గౌరవం లేకుండా అవమానిస్తున్నారు : డీకే అరుణ (Etv Bharat) DK Aruna Election Campaign in Mahabubnagar :ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి వంశీచంద్ రెడ్డి ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ మండిపడ్డారు. ఆ తీరును ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె, మహిళ అనే కనీస గౌరవం లేకుండా రేవంత్ అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వక్తం చేశారు.
తనను వ్యక్తిగతంగా దూషిస్తే ఓట్లు రాలుతాయని సీఎం భావిస్తున్నారని, కానీ రోజురోజుకూ తన విలువ దిగజారుతోందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని డీకే అరుణ అన్నారు. 'అరుణమ్మ రక్తం కల్తీరక్తం' అనడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తూ సీఎం అయిన రేవంత్, ఐదు నెలలకే విర్రవీగుతున్నారని దుయ్యబట్టారు.
అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని డీకే అరుణ ధ్వజమెత్తారు. గత 60 ఏళ్లుగా తన కుంటుంబం ప్రజాసేవలో ఉందని, తన తండ్రిని, సోదరుడుని కోల్పోయినా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. మహబూబ్‌నగల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు నీరందేలా డీపీఆర్ సిద్ధం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్రం నుంచి పాలమూరు రంగారెడ్డికి నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎన్ని జిమిక్కులు చేసినా - బీజేపీ అభ్యర్థుల గెలుపు పక్కా : ఎంపీ లక్ష్మణ్ - BJP MP Laxman Election Campaign
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని డీకే అరుణ విమర్శించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మెగా డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. టెట్, డీఎస్సీ రుసుముల ధర ఎందుకు పెంచారని నిలదీశారు. పోలీస్ కానిస్టేబుళ్లకు ఇప్పటికీ పీఆర్సీ అమలు కాలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే కేంద్ర నిధులతో నియోజకవర్గంలోని ఆసుపత్రులను ఉన్నతీకరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలకు కృషి చేస్తానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ కోసం ప్రయత్నిస్తానని డీకే అరుణ చెప్పారు.
"అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ఎక్కడ కూడా ప్రస్తావించకుండా, ప్రజలను పదేపదే మోసం చేస్తున్నట్లు ప్రజలు గ్రహించాలని నేను కోరుతున్నా. జీవో నంబర్ 46ను రద్దు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ చేయలేదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారు. మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కానీ వాళ్లు చేసే పనుల గురించి చెప్పడం లేదు." - డీకే అరుణ, మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి
రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి కోసం ఏనాడైనా పోరాటం చేశారా ? : డీకే ఆరుణ - Lok Sabha Elections 2024
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలే సర్కారును గద్దె దించుతారు : డీకెే అరుణ