ETV Bharat / state

కేటీఆర్​కు హైకోర్టులో ఊరట - న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతి - KTR FILED LUNCH MOTION PETITION

కేటీఆర్‌ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి - కేటీఆర్‌ వెంట విచారణకు వెళ్లనున్న న్యాయవాది రామచంద్రరావు - కేటీఆర్‌కు కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారన్న జడ్జి

ACB NOTICES TO KTR
ACB NOTICES TO KTR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 17 hours ago

Updated : 8 hours ago

KTR Filed Lunch Motion Petition in Telangana High Court : మాజీ మంత్రి కేటీఆర్​కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఏసీబీ విచారణకు వెళ్లేటప్పుడు లాయర్​ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌ వెంట న్యాయవాది రామచంద్రరావు వెళ్లనున్నారు. విచారణ సమయంలో కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని జడ్జి తెలిపారు. లైబ్రరీలో కూర్చుని విచారణను లాయర్‌ చూడవచ్చని ఏఏజీ వివరించారు. అయితే ఏసీబీ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయించాలన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వినతిని న్యాయస్థానం నిరాకరించింది. న్యాయవాదితో కలిసి రేపు విచారణకు వెళ్లాలని హైకోర్టు కేటీఆర్‌కు సూచించింది. రేపటి ఏసీబీ విచారణ తర్వాత ఏమైనా అనుమానాలుంటే మళ్లీ సంప్రదించవచ్చని హైకోర్టు పేర్కొంది.

హైకోర్టులో వాదనలు : ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణలో భాగంగా కేటీఆర్‌ తనతో పాటు తన న్యాయవాదిని అనుమతించాలని ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున న్యాయవాది ప్రభాకర్‌రావు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. గతంలోనూ లాయర్‌ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ రాజకీయ నేత అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు అనుమతించిందన్న న్యాయవాది ప్రభాకర్​ రావు న్యాయస్థానానికి తెలిపారు.

ఏసీబీపై అనుమానం : గతంలో సీబీఐ దర్యాప్తు కేసులో విచారణ అధికారిపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారని, తన వాంగ్మూలాన్ని పూర్తిగా నమోదు చేయడం లేదని, ఆడియో, వీడియో రికార్డింగ్‌ను ఆదేశించినట్లు కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ రావు కోర్టుకు తెలిపారు. ఏసీబీ దర్యాప్తుపైన కూడా అనుమానాలున్నాయని అన్నారు. లగచర్ల దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మరో కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగా తారుమారు చేసినట్లు కోర్టుకు వివరించారు. వాదనలను విన్న ధర్మాసనం రేపు విచారణకు న్యాయవాదితో కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.

ఏసీబీ తరఫున ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్​తో పాటు న్యాయవాదిని అనుమతించొద్దంటూ వాదించారు. అయితే న్యాయవాదిని అనుమతిస్తే సమస్యేంటని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది. అనంతరం ముగ్గురి పేర్లను ఇవ్వాలని కేటీఆర్ లాయర్​కు సూచించింది. అనంతరం విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదావేసింది. ఆ సమయానికి కేటీఆర్​ తరపున న్యాయవాది రామచంద్రరావు వెళతారని ఆయన తరపు లాయర్ ప్రభాకర్ రావు తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. దీంతో రేపు కేటీఆర్​, తన లాయర్​తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

లాయర్లను అనుమతించకపోవడంతోనే : ఏసీబీ నోటీసుల నేపథ్యంలో ఈనెల 6న మాజీ మంత్రి కేటీఆర్‌ తన న్యాయవాదులతో కలిసి హైదరాబాద్​లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా పోలీసులు లాయర్లను ఏసీబీ ఆఫీస్​లోకి అనుమతించలేదు. దీంతో కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో కేటీఆర్ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోఆయన న్యాయస్థాన్ని ఆశ్రయించారు. ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు.

ఏడున్నర గంటల పాటు విచారణ : ఈ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించి ఏసీబీ అధికారులు వాంగ్మూలం నమోదు చేశారు. ఏసీబీ మరోసారి అరవింద్‌ను విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అర్వింద్ కుమార్‌ తన పరిధిలోని హెచ్​ఎండీఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు హెచ్​ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్​ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేయించారన్న ఆరోపణలపై ఈ విచారణ సాగింది. మరవైపు ఇదే కేసులో ఏ3గా ఉన్న బీఎల్​ఎన్ రెడ్డిని ఈడీ ఇవాళ తొమ్మిదిన్నర గంటల పాటు విచారించింది. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేస్తోంది.

సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తా : కేటీఆర్‌

కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు - ఈనెల 16 న విచారణకు రావాలని ఆదేశం

Last Updated : 8 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.