Sam Konstas Praises Virat Kohli : బాక్సింగ్ డే టెస్టు సమయంలో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యంగ్ ప్లేయర్ కొన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కొన్‌స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం కాస్త వాగ్వాదానికి దారి తీసింది. దీంతో అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా మధ్యలో దూరి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఓ స్పోర్ట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీపై కొన్‌స్టాస్ ప్రశంసల వర్షం కురిపించాడు.
'కోహ్లీ నా ఆరాధ్య దైవం'
విరాట్ కోహ్లీ తన ఆరాధ్య దైవమని కొనియాడాడు కొన్‌స్టాస్. చిన్నప్పటి నుంచి తనకు విరాట్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. విరాట్ క్రికెట్లో ఒక లెజెండ్ అంటూ ప్రశంసించాడు. అలాగే విరాట్‌ను తన కుటుంబం మొత్తం ప్రేమిస్తుందంటూ వెల్లడించాడు. కోహ్లీతో ఆడడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.
విరాట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ : కొన్‌స్టాస్
"నేను బాక్సింగ్ డే టెస్టు తర్వాత విరాట్‌తో కాసేపు మాట్లాడాను. విరాట్ నాకు ఇన్స్పిరేషన్. ఆయనొక లెజెండ్. విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆయన పేరును జపిస్తున్నారు. ఆయన ఎప్పుడూ చాలా డౌన్ టూ ఎర్త్‌గా ఉంటారు. శ్రీలంక టూర్‌కు సెలెక్ట్ అయినప్పుడు తను నాకు విషెప్ చెప్పారు." అని ఇంటర్వ్యూలో కొన్‌స్టాస్ విరాట్‌తో మాట్లాడిన విషయాలను చెప్పుకొచ్చాడు.
ఫర్వాలేదనిపించిన కొన్‌స్టాస్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో కొన్‌స్టాస్ 4 ఇన్నింగ్స్ ల్లో 28.25 సగటుతో 113 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధ శతకం ఉంది. అరంగేట్ర మ్యాచ్ లోనే బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ను బాది అందరీ దృష్టిని ఆకర్షించాడు కొన్‌స్టాస్. విరాట్‌తో వివాదం విషయంలో మరింత పాపులర్ అయిపోయాడు.
విఫలమైన విరాట్
టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో విఫలమ్యయాడు. 9 ఇన్నింగ్స్‌లలో 23.75 సగటుతో మొత్తం 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ ఉంది.
విరాట్‌పై ఆసీస్ మీడియా ట్రోలింగ్- రవిశాస్త్రి స్ట్రాంగ్ కౌంటర్
ఆసీస్ ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ కౌంటర్ - ఆ ఒక్క సైగతో అందరూ షాకయ్యారుగా!