Actress Slapped By Star Kid : సినీ ఇండస్ట్రీలో అవకాశాలు, సక్సెస్ రావడం ఓ ఎత్తు అయితే, ఆ స్టార్‌డమ్‌ని కాపాడుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా హీరోయిన్లకు ఇది చాలా కష్టం. అదృష్టవశాత్తు బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలోనే భారీ విజయాలు అందుకున్నారు.
అయితే హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో కొందరు హఠాత్తుగా కనుమరుగయ్యారు. అటువంటి హీరోయిన్లలో అమృత రావు ఒకరు. ఆమె అందం, అభినయంతో భారీగా అభిమానులను సంపాదించుకుని, అర్ధంతరంగా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అలా ఎందుకు జరిగింది? ఆమె జీవితంలో ఆసక్తికర వియాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కెరీర్ ఎలా మొదలైంది?
2002లో 'అబ్ కే బరాస్' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు అమృత రావు. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా అంతగా టాక్ అందుకోలేకపోయింది. అయితే 2003లో షాహిద్ కపూర్‌తో చేసిన 'ఇష్క్ విష్క్' సూపర్ హిట్ య్యింది. అంతేకాకుండా అమృత రావు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత షారుక్ ఖాన్‌తో చేసిన 'మై హూ నా' (2004), షాహిద్ కపూర్ సరసన చేసిన 'వివాహ్' (2006) కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. వీటితో ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.
ఈషా డియోల్‌తో వివాదం
2006లో అమృత 'ప్యారే మోహన్' అనే మూవీలో ఫర్దీన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, ఈషా డియోల్‌తో యాక్ట్ చేశారు అమృత. అయితే షూటింగ్ సమయంలో అమృత, ఈషా మధ్య వాగ్వాదం జరిగింది. ఎంతలా అంటే అమృతను ఈషా చెంపదెబ్బ కొట్టేంతవరకూ వెళ్లింది వారి వివాహం. అయితే చాలా కాలం కూడా తర్వాత ఈషా, ఈ ఘటన గురించి పశ్చాత్తాపం చెందలేదని, అమృత చెంపదెబ్బకు అర్హురాలని తెలిపారు. మరోవైపు అమృత ఈ విషయం గురించి మౌనంగా ఉన్నారు. అయితే నిజంగా అక్కడ ఏం జరిగిందన్న విషయం ఇప్పటికీ ఎవ్వరికీ అసలు తెలియదు.
వ్యక్తిగత జీవితం
ఆ తర్వాత అమృత, సినిమాల్లో చాలా తక్కువగా కనిపించారు. 2014లో తన ప్రియుడు ఆర్జే అన్మోల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2020లో ఈ జంటకు వీర్ అనే కుమారుడు జన్మించాడు. తమ జీవిత విశేషాలను అభిమానులతో షేర్ చేసుకునేందుకు 'ఆఫ్ థింగ్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ప్రారంభించారు. 2023లో అదే పేరుతో ఓ బుక్ ప్రచురించగా, దానికి ఆమె సహా రచయితగా వర్క్ చేశారు.
అయితే చివరిగా 2019లో 'బయోపిక్ థాకరే'లో అమృత కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3'లో నటించారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
అద్దె కట్టలేక రైల్వే ప్లాట్ ఫామ్‌పై నిద్ర - కట్ చేస్తే బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా!
యాక్టర్లే ప్రొడ్యూసర్లు! - 7 థియేటర్లలో రిలీజ్! కట్ చేస్తే నేటికీ ఈ సినిమా సూపర్ హిట్టే!