Election Survey Agency Phone Calls to Voters : ఆఫీసుకు ఆలస్యమవుతుందని ఓ వ్యక్తి చకచకా బైక్ తీసి స్పీడ్‌గా వెళుతున్నాడు. సగం దూరం వెళ్లాక ఫోన్ రింగ్ అయింది. అత్యవసరమైన ఫోన్ అనుకొని బండి పక్కన ఆపి కాల్ ఎత్తి హలో అనేలోపు, నమస్కారం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటు ఎటు వైపు వేస్తున్నారో తెలుసుకోవచ్చా? అని వినిపించింది. దీంతో అతనికి పట్టలేనంత కోపం వచ్చింది. ఫోన్లోనే ఆ వ్యక్తిని చితకబాదాలన్నంత మండిపోయింది. కానీ చేసేది ఏం లేక నా ఓటు ఎవరికో ఒకరికి వేస్తాను నీకెందుకు చెప్పాలి అంటూ కోపంలో ఫోన్ పెట్టేశాడు. ఇలా రోజుకు సుమారు 10కి పైగా కాల్స్ రావడంతో జనం విసుగెత్తిపోతున్నారు.
Political Survey Phone Calls To Voters: ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు అవకాశాలను ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సర్వే ఏజెన్సీలను సంప్రదిస్తుంటారు. అభ్యర్థులు ఏజెన్సీలకు అధిక మొత్తంలో నగదు చెల్లిస్తుండటంతో గతంలో పదుల సంఖ్యలో ఉన్నవి ప్రస్తుతం వందల సంఖ్యలో పెరిగాయి. సాంకేతికతను వినియోగించి చేసే సర్వేలతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమయం సందర్భం లేకుండా ఫోన్‌లు చేస్తూ మీరు ఈ అభ్యర్థికి ఓటేస్తే ఈ నంబర్ నొక్కండి లేదంటే ఇంకో నంబరు నొక్కండి అంటూ పదే పదే ఫోన్‌లు చేస్తూ ఓటర్ల ఓపికను పరీక్షిస్తున్నారు.
ఆ ఫోన్ కాల్స్, మెసేజెస్ నమ్మితే అంతే సంగతులు.. కష్టార్జితం అంతా స్వాహా!