KTR On LRS Issue Telangana 2024 :ఎల్ఆర్ఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలు ఇచ్చి ఆ పార్టీ ప్రజలను గందరగోళం చేసిందని ఆక్షేపించారు.
KTR Fires on Congress Govt Over LRS :ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించాలన్న కేటీఆర్ విపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రజల రక్త మాంసాలను పీలుస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజల నుంచి 20 వేల కోట్ల రూపాయాలు వసూలు చేసేందుకు వేసిన ఎత్తుగడ ఎల్ఆర్ఎస్ కాదా అని నిలదీశారు.
'చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు' - మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు
"ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సమంజసమా? భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క సమాధానం చెప్పాలి. మధ్య తరగతి ప్రజలపై భారాన్ని మోపడం తగదు. ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయల వరకు భారం పడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలి. ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా 6 తేదీ నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. ఏడో తేదీన కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు అందిస్తాం." -కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్