తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే : మంత్రి కోమటి రెడ్డి - Komatireddy Fires On KCR

Komatireddy Venkat Reddy Fires On KCR : సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లో మీడియాతో నిర్వహించిన చిట్​చాట్​లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యాదాద్రిలో స్కాం జరిగిందని ఎన్నికల తర్వాత దానిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.

Komatireddy Venkat Reddy Fires On KCR
Komatireddy Venkat Reddy Fires On KCR

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 2:44 PM IST

Komatireddy Venkat Reddy Fires On KCR :యాదగిరి గుట్ట పేరు మార్చటమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లో మీడియాతో చిట్​చాట్ సందర్భంగా కోమటి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ చేసిన పాపాల వల్లే కరవు వచ్చిందన్న కోమటిరెడ్డి, దేవుడి పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. గేట్లు తెరవక ముందే తమ పార్టీలోకి తోసుకుని మరీ వస్తున్నారని పేర్కొన్నారు.

యాదగిరి గుట్టలోనూ స్కాం :యాదగిరి గుట్టలో స్కాం జరిగిందన్న కోమటిరెడ్డి ఎన్నికల తర్వాత దానిపై విచారణ జరిపిస్తామన్నారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చేందుకు ఎన్నికల కోడ్ తర్వాత జీఓ వస్తుందని తెలిపారు. ఊళ్లలో ఇళ్లను కూల్చి కేసీఆర్ ఫామ్​హౌస్​కు రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే ఆలేరు పూర్తయ్యేదని కానీ కేసీఆర్​ ఆ పని చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ ఇండ్లు ఇచ్చామని, కేసీఆర్​ ఎవరికి ఇచ్చారో కూడా తెలియడం లేదని కోమటి రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో నాయకులు, అధికారులు దళితబంధు, సీఎంఆర్​ఎఫ్​పై కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.

యాదగిరి గుట్ట నిర్మాణంపై విచారణ చేయిస్తాం : కోమటిరెడ్డి

Komatireddy Comments On KCR :కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని మంత్రి కోమటి రెడ్డి విమర్శించారు. అధికారులతో పాపపు పనులు చేయించారని ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన అధికారులకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదన్నారు. కేసీఆర్ ప్రతీదానిని రాజకీయం చేశారని కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లాను సర్వనాశనం చేశారన్న మంత్రి, ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఆ ప్రాంతానికి వెళ్తారని ప్రశ్నించారు.

పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల కోసం నేను పనిచేస్తాను. ఒక్క తెలంగాణ కోసం తప్ప నేను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదు. టికెట్ల విషయంలో కలుగజేసుకోను. పార్టీ కోసమే పనిచేస్తాను. నా శాఖ, నియోజకవర్గం తప్ప ఇతర విషయాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఎండిన పంటలను చూస్తే ఏడుపు వస్తోంది. ఫోన్​ ట్యాపింగ్​ను ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి

దానం నాగేందర్​ చేరికపై మంత్రి కోమటి రెడ్డి స్పందన :ఎమ్మెల్యేదానం నాగేందర్ పార్టీలో చేరడంపై మంత్రి కోమటి రెడ్డి స్పందించారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీకి పోటీ చేయడం కష్టమేనన్నారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం వల్ల న్యాయ పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.

మద్ధతు ధర ఇచ్చే విషయంలో రైతులను వేధిస్తే కఠిన చర్యలు : కోమటి రెడ్డి వెంకటరెడ్డి

బీఆర్ఎస్​లో చివరికి మిగిలేది ఆ నలుగురు మాత్రమే : మంత్రి కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details