Kishan Reddy Oath as a Central Minister : బీజేపీలోకి ఒక సాధారణ యువనాయకుడిగా ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎదిగి తన నాయకత్వాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పారు. నిత్యం ప్రజల సమస్యల తరుఫున పాటుపడుతూ, పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తనను అభివృద్ధి చేసుకుంటు ఎదిగిన వ్యక్తి. సాధారణ నాయకుడి నుంచి కేంద్ర మంత్రి పదవి అది కూడా మూడోసారి బాధ్యతలు చేపట్టారు, అతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో తన గళం వినిపిస్తూ పోరుయాత్ర చేసిన మహానీయుడు. రాష్ట్ర అభివృద్ధే తన జీవిత లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాన్ని నిత్యం సమస్యలను ఎత్తు చూపుతూ ముందడుగు వేశారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం.
Kishan Reddy Life Story : స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. 1995లో వివాహం చేసుకున్నారు. జయప్రకాశ్ నారాయణ స్పూర్తితో జనతా పార్టీ యువకార్యకర్తగా 1977లో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి కమిటీ కన్వీనర్‌గా పని చేశారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు బీజేవైఎం ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు పని చేశారు.
Kishan Reddy Political Career :1990 నుంచి 1992 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. 1992 నుంచి 1994 వరకు జాతీయ ఉపాధ్యక్షునిగా 1994 నుంచి 2001వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2002 వరకు బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2003 నుంచి 2005 వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.