తెలంగాణ

telangana

ETV Bharat / politics

లోక్​సభ పోరు ముగిసింది - ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళైంది - బరిలో 52 మంది అభ్యర్థులు - Telangana Graduate MLC By Election - TELANGANA GRADUATE MLC BY ELECTION

Graduate MLC Election Campaign : లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. వరంగల్‌- ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా వెల్లడైంది. దీంతో అభ్యర్థులు అందరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో 25వ తేదీ సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది.

MLC BY Election Schedule 2024
Nalgonda Collector on MLC BY Election (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 7:08 AM IST

ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టి పెట్టిన నాయకులు బరిలో 52 మంది అభ్యర్థులు (ETV Bharat)

Graduate MLC Election Campaign: వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఉమ్మడి జిల్లాల పరిధిలో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ నుంచి చింతపండు నవీన్‌, బీఆర్​ఎస్​ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. కాగా వీరితో పాటు మొత్తం 52 మంది బరిలో నిలిచారు.

తాజా జాబితా ప్రకారం వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్ల వివరాలు

  • పురుషులు - 2,86,993
  • మహళలు - 1,74,788
  • ఇతరలు - 05
  • మొత్తం ఓటర్లు - 4,61,786
  • గతంతో పోల్చితే తగ్గిన ఓట్లు - 43,777
  • గడిచిన ఎన్నికల్లో చెల్లని ఓట్లు - 21,636

MLC BY Election Schedule 2024: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికే ఓటు హక్కు ఉంటుంది. చదువుకున్న వారు అయినప్పటికీ గడిచిన ఎన్నికల్లో 21,636 ఓట్లు చెల్లలేదు. సాధారణ ఓటు హక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు ప్రాధాన్య క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటెయ్యాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇతర ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఒకే విధంగా ఉంటుందని నల్గొండ కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన తెలిపారు.

లోక్​సభ పోరు ముగిసింది - ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీల గురి - Telangana Graduate MLC By Election

"అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది పోటీ చేస్తున్నారు. వారు ఇప్పటి నుంచి ప్రచారం చేసుకోవచ్చు. సాధారణ ఎన్నికలకు ఎలాంటి నియమాలు ఉన్నాయో అవే పాటించాల్సి ఉంటుంది. కారు ర్యాలీ, బైక్​ ర్యాలీ, రోడ్ షో, బహిరంగ సభలు పెట్టుకోవాలంటే అనుమతి తీసుకోవాలి." - దాసరి హరిచందన, ఎమ్మెల్సీ ఎన్నికల ఆర్వో

Nalgonda Collector on MLC BY Election : ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో నిలిచిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చని ఆయా జిల్లాలలో ప్రచారం నిర్వహించుకుంటే సంబంధిత ఏఆర్వోల ద్వారా అనుమతులు తీసుకోవాలని ఆర్వో హరిచందన సూచించారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు. ప్రసంగాలలో రెచ్చగొట్టే సందేశాలు, కులం, మతం వంటివి లేకుండా చూసుకోవాలన్నారు. సీ- విజిల్ ద్వారా మద్యం, నగదు వంటివి ఎక్కడైనా పంపిణీ చేస్తున్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల ఆర్వో హరిచందన తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు - Telangana Graduate MLC Elections

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు - Telangana Graduate MLC Elections

ABOUT THE AUTHOR

...view details