తెలంగాణ

telangana

ETV Bharat / politics

బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - Minister Uttam about Reservation - MINISTER UTTAM ABOUT RESERVATION

Minister Uttam on BJP : బీజేపీకి మరోసారి అధికారం ఇస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. ఇవాళ పలు చోట్ల మంత్రులు ఉత్తమ్​, పొంగులేటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ, బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.

Minister UttamKumar Reddy  Comments on BJP
Minister Uttam on BJP

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 3:00 PM IST

బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుంది : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Minister UttamKumar Reddy Comments on BJP : బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతుగా సూర్యాపేట జిల్లా మోతెలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టీమ్ ఇండియా క్రికెట్ జట్టులా తామందరం రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నట్లు చెప్పారు.

ఓట్ల కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ, అమిత్‌షా, నడ్డా పదేళ్లలో తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ఒక్క ఎంపీ స్థానం కూడా రావడం కష్టమేనని జోస్యం చెప్పారు. కోదాడ అభివృద్ధిలో మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి చేసిందేమీ విమర్శించారు. తన కంటే గొప్పగా కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి పార్లమెంట్ ప్రజల తరఫున పోరాడుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Minister Ponguleti Srinivas Reddy on KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​వి అన్ని దొంగ మాటలని, బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మోసం చేసిన బీజేపీని బీఆర్​ఎస్​ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండల దమ్మాయిగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్​లో పాల్గొని ఆయన మాట్లాడారు.

కమలం పార్టీని ప్రశ్నిస్తే జైల్లో పెడతారని బీఆర్​ఎస్​కు భయమని, వారిది పట్టపగలు తిట్టుకోవడం, రాత్రికి వేడుకోవడమని పొంగులేటి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, అన్నారు. తెలంగాణలో ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం ఇబ్బంది పడొద్దని, ఎక్కడైనా ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ వచ్చింది కరెంట్​ పోయిందని కేసీఆర్​ అంటున్నారని, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్​కు రూ.3.50 పైసలకు విద్యుత్​ కొనుగోలు చేసి ప్రజలను దోచుకున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. పదేళ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజలకు చేసేందేమీలేదని ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థి రఘురాం రెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు.

'భారతదేశంలో పదేళ్లు పరిపాలించిన మోదీ బీజేపీ ప్రభుత్వంలోని నేతలంతా ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారు. రాష్ట్రానికి ఏమైనా చేశారా అని అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు' -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి

ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ దశ - దిశను మార్చబోతున్నాయి : మంత్రి ఉత్తమ్‌ - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details