తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop - CHANDRABABU AT TDP WORKSHOP

Chandrababu At TDP workshop in Vijayawada 2024 : ఏపీలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం పెరిగిపోయిన తరుణంలో ఎన్నికల్లో కూటమి అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్‌లో హాలులో టీడీపీ అభ్యర్థులతో నిర్వహించిన వర్క్​షాపులో గెలుపు వ్యూహంపై కీలక ప్రసంగం చేశారు. అధికారంలోకి వచ్చాక పార్టీని నమ్ముకున్న అందరికి న్యాయం చేస్తానన్న బాబు, పురందేశ్వరీ, పవన్ కల్యాణ్​ల సమయస్ఫూర ర్తిని కొనియాడారు.

Chandrababu At TDP workshop in Vijayawada 2024
Chandrababu At TDP workshop in Vijayawada 2024

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 4:32 PM IST

Chandrababu At TDP workshop in Vijayawada 2024 :ఏపీ ప్రగతి కోసం 3పార్టీలు వేసే పునాది, 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖలో దొరికిన 25వేల కోట్ల డ్రగ్స్‌లో రాష్ట్ర అధికారుల తీరుని సీబీఐ సైతం తప్పుబట్టిందని ధ్వజమెత్తారు. వైసీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని వ్యాఖ్యానించారు. ఎన్డీఏకు కేంద్రంలో 400 కి పైగా, రాష్ట్రంలో 160కి పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో విజవాయడలోని ఎ కన్వెన్షన్ లో చంద్రబాబు వర్క్ షాప్ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభించారు. అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ఇంచార్జులు, జనసేన, బీజేపీ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైన నేతలు చర్చించారు.

ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం కోసం దేశం కోసం జట్టు కట్టామని ఆయన స్పష్టం చేశారు. సమర్ధుల ఎంపిక కోసం రాజకీయాల్లో పొలిటికల్ రీ-ఇంజినీరింగ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సోషల్ రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. కూటమి నిలబెట్టిన అభ్యర్థి గెలవాలి అనేది మూడు పార్టీల లక్ష్యం కావాలని సూచించారు.

TDP workshop in Vijayawada 2024 :ఏపీలో న్యాయం జరగాలని లోక్‌సత్తా పార్టీ కూడా ముందుకు వచ్చిందని చంద్రబాబు తెలిపారు. పొత్తుల వల్ల అందరికీ సీట్లు ఇవ్వలేక పోయామన్న ఆయన, రాష్ట్రం గెలవాలన్నది అందరి నినాదం కావాలని ఆకాంక్షించారు. రౌడీయిజం, అధికార దుర్వినియోగాన్ని అభ్యర్థులు దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రత్యర్ధుల కుట్రలు ధీటుగా ఎదుర్కోవాలన్నారు. తెలుగు ప్రజలు గెలవాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలవాలని అన్నారు.

డ్రగ్స్‌పై పోరాడుతుంటే తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష చేయలేదని విమర్శించారు. ముంద్రా పోర్ట్ లో దొరికిన డ్రగ్స్‌కు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి సంబంధం బయట పడినా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ భాగోతంలోనూ వైసీపీ నేతల పాత్ర బట్టబయలైందని చంద్రబాబు విమర్శించారు.

అడ్డంగా దొరికిపోయి తెలుగుదేశం నేతలపైనా, పురంధేశ్వరిపైనా నిందలు మోపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర సంపద అంతా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్ మాఫియా రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో అక్రమాలకు తెరలేపి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని దుయ్యబట్టారు. వైసీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని వ్యాఖ్యానించారు. 200, 500 రూపాయల నోట్లను రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు.

Chandrababu On Alliance in AP :పెద్ద నోట్ల రద్దు కావాలనేది తన ఆలోచన అన్న చంద్రబాబు, మోదీ అడుగులు కూడా అలాగే పడుతున్నాయని తెలిపారు. బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేసేశారని ఫేక్ లెటర్ పెట్టేసి వైకాపా ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఇది తాత్కాలిక పొత్తు అని తన పేరుతో ఫేక్ లెటర్లు వదిలారని చంద్రబాబు విమర్శించారు. పురందేశ్వరి తన కుటుంబ సభ్యురాలే కావచ్చు, కానీ ఆమె ముప్పై ఏళ్లకుపైగా వేరే పార్టీల్లో ఉన్నారని తెలిపారు. ఆమె విషయంలో ఎన్నో తప్పుడు వార్తలు రాశారని విమర్శించారు. జనసేన మీద.. పవన్ మీద అలాగే తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఎన్డీఏకు కేంద్రంలో 400+ వస్తాయి.. రాష్ట్రంలో 160+ రావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. 20+ ఎంపీ స్థానాలను కూటమి గెలవాలని, కడప ఎంపీ మనమే గెలవబోతున్నామని తెలిపారు. 160 సీట్లు గెలవడానికి 160 మీటింగులు పెడుతున్నానని, 160 సెగ్మెంట్లల్లో పర్యటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. అభ్యర్థులు ఏ మాత్రం ఏమారినా ఫోన్లు వస్తాయన్నారు. సీట్లు రాని అభ్యర్థుల బాగోగులు తామ చూసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టంచేశారు. బాబాయ్ గొడ్డలి పోటు కేసులో ఎన్నో ట్విస్టులని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీబీఐ అధికారి మీదే కేసులు పెట్టారు.. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారని అన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక సీబీఐ తిరిగి వెళ్లిపోయిందని విమర్శించారు.

టెర్రరిస్టుల తరహాలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఐఆర్ఎస్, రైల్వే సర్వీసెస్, ఫారిన్ సర్వీసెస్ అంతా వీళ్లే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సరెండర్ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొందరు భయపడి, ఇంకొందరు లాలూచీ పడి పోయారు. ఓ పది మందికి సీట్లిస్తే సామాజిక న్యాయం జరగదు. గ్రేటర్ రాయలసీమ పరిధిలో 41 మందికి రెడ్లకే వైసీపీ టిక్కెట్లు ఇచ్చింది. టీడీపీలో బీసీలకే పెద్ద పీట వేశాం. - చంద్రబాబు, టీడీపీ అధినేత

సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా అదే చేసేవాళ్లమని చంద్రబాబు తెలిపారు. ఏపీలో వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ భావించారన్న చంద్రబాబు, ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని అన్నారు. పొత్తుల వల్ల తెలుగుదేశం కోసం పని చేసిన 31 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయామని అన్నారు. ఇక పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు టిక్కెట్లు ఇవ్వలేకపోయామని తెలిపారు. పెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను నిలబెడుతున్నామన్నారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంచుకున్నామని వివరించారు. సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details