Daku Maharaj OTT : నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన 'డాకు మహారాజ్' థియేటర్లలో ర్యాంప్ ఆడిస్తోంది. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శతక్వం వహించిన ఈ సినిమా ఆదివారం గ్రాండ్‌గా రిలీజైంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. థియేటర్లలో బాలయ్య మాస్ యాక్షన్‌ను ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రానుందని ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. అయితే 'డాకు మహారాజ్' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఇక ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన 6- 8 వారాల తర్వాత స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తుంది. ఈ లెక్కన డాకు మహారాజ్ మార్చి 2 లేదా 3వ వారం నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
BGM అదుర్స్
ఈ సినిమాలో బాలయ్య యాక్షన్‌కు తగ్గట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎమ్ అదరగొట్టాడు. హాలులో స్పీకర్లు బద్దలయ్యే రేంజ్లో మ్యూజిక్ ఉందని ఆడియెన్స్ చెబుతున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా విజయానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ కారణం అని అంటున్నారు.
వరుసగా నాలుగో హిట్
కాగా, బాలయ్యకు ఇది వరుసగా నాలుగో విజయం. 2021లో 'అఖండ', 2023లో 'వీరసింహా రెడ్డి', 'భగవంత్ కేసరి'తో ఇప్పటికే బాలయ్య హ్యాట్రిక్ కొట్టి జోరు మీద ఉన్నారు. తాజాగా 'డాకు' తో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్నారు. ఇకపై సెకండ్ ఇన్నింగ్స్‌లో బాలయ్య ర్యాంపేజ్ చూస్తారని ఆయన ఇటీవల ఓ ఈవెంట్లో చెప్పారు.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లగా నటించారు. ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో కలిసి ఆడిపాడింది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' సినిమా చేస్తున్నారు.
'డాకు మహారాజ్' రివ్యూ : బాలయ్య లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్- 'డాకు మహారాజ్' ప్రీక్వెల్ కూడా ఉందంట!