BRS MP Candidates List 2024 :తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇవాళ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాసేపటికే మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌ను, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీఅభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి (Nalgonda BRS MP Candidate) పేర్లను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల సంఖ్య 16 స్థానాలకు చేరింది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానం (Hyderabad BRS MP Seat) మాత్రమే పెండింగ్‌లో ఉంది. త్వరలోనే ఈ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
Nalgonda BRS MP Candidate :నల్గొండ లోక్‌సభ స్థానానికి మొదటి నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరు బాగా వినిపించినా, చెరుకు సుధాకర్ కూడా రేసులో ఉండటంతో ఇద్దరిలో ఎవరిని అవకాశం వరిస్తుందోనని ఉత్కంఠగా ఉండేది. ఇక తాజాగా కంచర్ల కృష్ణారెడ్డి వైపే స్థానిక నేతలంతా మొగ్గు చూపడంతో కేసీఆర్ కూడా ఆయనకే జై కొట్టారు. దీంతో ఇన్నాళ్లూ నల్గొండ బరిలో బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలుచుంటారన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఇవాళ తెర పడింది.
సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ - Secunderabad BRS MP Candidate
Bhuvanagiri BRS MP Candidate : మరోవైపు భువనగిరి లోక్‌సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, సీనియర్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్‌తో పాటు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి పేర్లు వినిపించాయి. లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయమై ఆయా నియోజకవర్గాల పరిధిలోని నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు, కార్యకర్తలు క్యామ మల్లేశ్‌కే ఓటు వేయడంతో అధిష్ఠానం ఆయనే పేరే ప్రకటించింది.