BRS Lok Sabha Candidates List 2024 : లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామి రెడ్డి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. భారత రాష్ట్ర సమితి, బీఎస్పీ పొత్తు ప్రతిపాదన విఫలం కావడంతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక విశ్రాంత ఐపీఎస్ వెంకట్రామి రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మొత్తం 17 స్థానాలకు గానూ ఇప్పటి వరకు బీఆర్ఎస్ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్ లిస్ట్‌లో వీరికే ఛాన్స్
చర్చల అనంతరం 'మెదక్'పై నిర్ణయం : అంతకు ముందు మెదక్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులతో సుధీర్ఘ చర్చల అనంతరం మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామి రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధినేత ఖరారు చేశారు.
కేసీఆర్ వల్లే నాకు రాజకీయ జీవితం : తనకు మెదక్ ఎంపీ సీటు కేటాయించినందుకు వెంకట్రామి రెడ్డి పార్టీ అధినేతకు ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టుక రాజకీయం కాదని, రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాదని పేర్కొన్న ఆయన, 10 సంవత్సరాలకు పైగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారంలో తాను చూపిన చొరవ వల్లే ఇవాళ ఈ రాజకీయ జీవితం లభించిందని తెలిపారు.
'మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంచి అవకాశాన్ని కల్పించారు. 10 సంవత్సరాలకు పైబడి ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేసే అవకాశం నాకు లభించింది. 7 సంవత్సరాలు సిద్దిపేట జిల్లాలో పని చేశాను. ప్రజల ఆమోదం లేకుంటే ఒక అధికారి రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా జిల్లాలో పని చేయలేరు. ప్రజావాణిలో నేను ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాను. నా కృషిని గుర్తించి మాజీ సీఎం కేసీఆర్ నాకు రాజకీయ జీవితాన్ని కల్పించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తించి, ఇవాళ మెదక్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కేసీఆర్‌కు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అని ఆయన అన్నారు.
మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి
13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే :
⦁ వరంగల్ - కడియం కావ్య
⦁ చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్
⦁ జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్