BRS Concludes Lok Sabha Preparatory Meetings :లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా భారత రాష్ట్ర సమితి చేపట్టిన లోక్‌సభ సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఈ నెల మూడో తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో(Telangana Bhavan) ప్రారంభమైన సమీక్షా సమావేశాలుఇవాళ్టి నల్గొండ సమావేశంతో పూర్తయ్యాయి. 16 రోజుల పాటు 120 గంటలకు పైగా జరిగిన సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని, వాటి ఆధారంగా పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని గులాబీ నేతలు తెలిపారు.
బీఆర్ఎస్కి కార్యకర్తలే కథానాయకులు - వారే పార్టీకి ధైర్యం చెప్పారు : కేటీఆర్
వచ్చే నెల మొదటి వారం నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు ఉంటాయని, సీనియర్లు పార్టీ పరిశీలకులుగా హాజరవుతారని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల ఓటమిపై సమీక్షించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై(Lok Sabha Election Activity) సమావేశంలో చర్చించారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, కాంగ్రెస్‌కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
Harish Rao Comments on Congress Govt : గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ముందుకు సాగుదామని శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తామన్న ఆయన, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ప్రచారంలో అబద్దం, పాలనలో అసహనం అనేది కాంగ్రెస్ తీరు అని అభివర్ణించారు. 6 గ్యారంటీల్లోని 13 హామీలను కాంగ్రెస్ మరో ఇరవై రోజుల్లో నెరవేర్చాలన్నారు. 20 రోజుల్లో హామీలను నెరవేర్చకపోతే పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుందని గుర్తు చేశారు.
ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేది : కేటీఆర్