BJP MLA Maheshwar Reddy On Congress govt :గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను దగ్గర పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రీ-సెటిల్మెంట్ చేసుకుంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నాలుగు నెలలు గడిచినా అవినీతి పరులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అంతర్గతంగా సెటిల్మెంట్ చేసుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్లో శిందేలు లేకపోతే మహబూబ్నగర్లో సీఎం రేవంత్రెడ్డి ఎందుకు అభద్రతా భావంతో మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో (BJP Office) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
BJP MLA Maheshwar Reddy Fires On Congress : హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 15 ఎకరాల భూమి హెటిరో డ్రగ్స్ పార్థసారథికి గత ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్లో ఆ భూమి విలువ రూ.1500కోట్లు- రూ.2000కోట్ల వరకు ఉంటుందన్నారు. జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని(Land) ప్రస్తుత ప్రభుత్వం హెటిరో(Hetero Drugs) డ్రగ్స్ పార్థసారథికి మళ్లీ కేటాయించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడతామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రూ.300 కోట్లను సీఎం రేవంత్రెడ్డి దిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
'గత ప్రభుత్వాన్ని రూ.20 వేలు డిమాండ్ చేసి - ఇప్పుడు మీరెందుకు ఇవ్వట్లేదు?' -