BJP Kishan Reddy Fires on Congress :కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం తమ స్వార్థం కోసం వాడుకుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకిషన్‌రెడ్డివ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్లలో ప్రజల కోసం ఆలోచన చేయలేదని, ఫామ్‌హౌస్ ఎలా పెంచుకోవాలని చూశారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించి, దొంగలు పోయి గజ దొంగలు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి డిసెంబర్ 9 ఇంకా వచ్చినట్లు లేదని ఎద్దేవా చేశారు.
BRS Leaders Joined in BJP :పాత గ్యారంటీలే అమలు చేయలేదు కానీ తుక్కుగూడకు వచ్చి కొత్త హమీలు ఇచ్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు మారాయి తప్పితే, పాలన మారలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, వాటి డీఎన్‌ఏ కూడా ఒక్కటే అని విమర్శించారు. జహీరాబాద్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు. మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి, నల్గొండకు చెందిన పిల్లి రామరాజు యాదవ్ తదితరులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
దేశప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయం : కిషన్‌రెడ్డి - lok sabha elections 2024