తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ - ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు : బండి సంజయ్‌ - KCR Involvement in Phone Tapping - KCR INVOLVEMENT IN PHONE TAPPING

Bandi Sanjay on KCR Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ, రేవంత్‌ సర్కార్‌ ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ నేత బండి సంజయ్‌ ప్రశ్నించారు. తక్షణమే కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని కోరారు.

KCR Involved in Phone Tapping Case
BJP Leader Bandi Sanjay Comments on KCR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 9:36 PM IST

Updated : May 27, 2024, 10:54 PM IST

Bandi Sanjay on KCR Involvement in Phone Tapping Case : కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించడం, గతంలో తాను చేసిన ఆరోపణలు ఇందుకు నిదర్శనమని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్‌ను పరిశీలిస్తే ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్‌ను ఉపయోగించుకున్నట్లు అర్ధమవుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సానుభూతిపరులతోపాటు పార్టీకి విరాళాలు ఇచ్చే వాళ్లను, మీడియా ప్రతినిధులను సైతం ఫోన్ ట్యాపింగ్‌తో టార్గెట్ చేశారంటే బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు కమలం పార్టీ అంటే ఎంతగా వణుకు పుడుతుందో తెలుస్తోందన్నారు. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సృష్టించినట్లు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్‌తో తేలిపోయిందన్నారు.

Phone Tapping Case Update :ఈ ట్యాపింగ్‌ కేసులో తనతో పాటు ఈటల రాజేందర్‌, ఎంపీ అర్వింద్‌ అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచారన్న విషయాన్ని వాంగ్మూలంలో వెల్లడించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కొందరు మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు పేర్కొన్నారు. సోషల్‌ మీడియా వాట్సప్‌, స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు సేకరించినట్లు, ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డులను ప్రణీత్‌రావు విశ్లేషించినట్లు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని గుర్తుచేశారు.

కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు : ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నట్లు తెలిసినా ఎందుకు భారత్‌కు రప్పించలేకపోతున్నారన్నారు. ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకొచ్చే అవకాశముందన్నారు. అయినా ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు.

తక్షణమే కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని కోరారు. సీబీఐతో సమగ్ర విచారణ జరిపించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించే అంశంపైనా శాసనసభ స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ శాసనసభా పక్షాన కోరుతున్నామన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో విస్తుగొల్పే అంశాలు! - Phone Tapping Case Update

రాధాకిషన్‌ రావు స్వామిభక్తి - 'ఇంతకంటే ఎక్కువ చెప్పలేను!' - Phone Tapping Case Updates

Last Updated : May 27, 2024, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details