SENSATIONAL COMMENTS ON AMBATI RAMBABU BY HIS SON-IN-LAW :'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అని పెద్దలు చెబుతుంటారు. కానీ అధికారవైసీపీలోమాత్రం ఇంట గెలవకపోయినా రచ్చ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు చిన్న కార్యకర్తల వరకూ ఇదే తంతు. వైసీపీ నేతలకు ఇంటి సభ్యులే వ్యతిరేక బాణాలను సంధిస్తున్నారు. ఇంటి నుంచే నిరసనసెగలు తగులుతున్నాయి. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచే నిరసన సెగ తగిలింది. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దంటూ మాజీ అల్లుడు వీడియో విడుదల చేశాడు. మంచితనం, మానవత్వం లేని వ్యక్తి అని, సిగ్గు లేని అంబటి రాంబాబు లాంటి వారికి ఓటేస్తే సమాజం నాశనం అవుతుందని వెల్లడించారు. దీంతో ఓటర్లు ఆలోచనలో పడ్డారు.
Budi Ravikumar Campaign : 'మా నాన్నని ఓడించండి' అంటూ డిప్యూటీ సీఎం అనకాపల్లి పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండో భార్య కుమార్తె అనురాధ పోటీ చేస్తున్నారు. దీంతో బూడి ముత్యాలనాయుడు మొదటి భార్య కుమారుడు బూడి రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రవికుమార్ తన తండ్రిపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 'కన్న కొడుకుకే న్యాయం చేయలేని వాడు ఓటేసిన ప్రజలకు ఏమి చేయగలరని' ప్రశ్నించారు. 'ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయండని, మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించాలని' రవికుమార్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు.