Vande Bharat Sleeper Coach : వందేభారత్ స్లీపర్ క్లాస్ కోచ్‌లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. శనివారం కర్ణాటక రాజధాని బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో (BEML) జరిగిన కార్యక్రమంలో స్లీపర్ కోచ్‌ను రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి, వందేభారత్ రైలు చైర్‌కార్, స్లీపర్, మెట్రో రకాలుగా ఉంటుందని తెలిపారు.