తెలంగాణ

telangana

ETV Bharat / photos

'యుద్ధంతో గాజా పతనం- కోలుకోవడానికి 350 ఏళ్లు!'

UN Report On Gaza Economy : హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ భారీ విధ్వంసం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో సగానికి పైగా ఇళ్లు, ఆస్పత్రులు ఇతర మౌలిక సదుపాయలు ధ్వంసమయ్యాయి. గాజాను పునర్నిర్మించాలంటే చాలా సమయం పట్టొచ్చని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు చెబుతున్నాయి. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

గాజా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవాలంటే ఏకంగా 350 ఏళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఐరాస ఏజెన్సీలు అంచనా వేశాయి. (Associated Press)
యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 66 శాతానికిపైగా ఇళ్లు, ఆస్పత్రులు, ఇతర మౌలిక సదుపాయలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో రోడ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. (Associated Press)
గాజాను పునర్నిర్మించడానికి ముందు శవాల గుట్టలు, బాంబుల శిథిలాలను తొలగించాల్సి ఉంటుంది. (Associated Press)
యుద్ధం కారణంగా గాజా తిరిగి కోలుకోలేని స్థితికి చేరింది. (Associated Press)
గాజాలో ఎటు చూసినా శిథిలాల దిబ్బలు తప్ప ఏమీ కనిపించని పరిస్థితి. (Associated Press)
దీని కంటే ముందు జరిగిన 4 యుద్ధాల కారణంగా గాజా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. (Associated Press)
తాజా యుద్ధం వల్ల గాజా పతనావస్థకు చేరిందని ఐరాస చెప్పింది. (Associated Press)
2007- 2022 వరకు గాజా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 0.4 శాతం ఉంది. ఇదే వృద్ధి రేటుతో గాజా ఆర్థికంగా పుంజుకోవడానికి 350 సంవత్సరాల కాలం పడుతుంది. (Associated Press)
భవిష్యత్తులో జనాభా పెరిగే కొద్దీ తలసరి GDP నిరంతరం, వేగంగా క్షీణిస్తుందని వివరించింది. (Associated Press)
17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌ దేశాల యుద్ధం వల్ల జరిగిన నష్టాల నుంచి ఆ రెండు దేశాలు ఇప్పుడే కోలుకుంటున్నాయి. (Associated Press)
గాజా తిరిగి కోలుకోవడం అనేది భవిష్యత్తు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. (Associated Press)
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన, విధ్వంసకర సైనిక చర్య ఇదే. (Associated Press)
ఒక ఏడాది యుద్ధం శతాబ్దాల వెనక్కి గాజాను తీసుకెళ్లిందని UN వాణిజ్య, వ్యాపార సంస్థ నివేదిక తెలిపింది. (Associated Press)
ఐక్యరాజ్య సమితి​ నివేదికపై ఇజ్రాయెల్ మాట్లాడేందుకు నిరాకరించింది. (Associated Press)
ఈ ఏడాది జనవరి నాటికి గాజాలో 18.5 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. (Associated Press)
గాజాలో నాలుగింట ఒకవంతు ధ్వంసమైనట్లు సెప్టెంబర్‌లో విడుదలైన సాటిలైట్‌ చిత్రాలను ఆధారంగా చేసుకొని ఐరాస అంచనా వేసింది. (Associated Press)
దాదాపు 2 లక్షల 27 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది. (Associated Press)
వీటిని తిరిగి నిర్మించాలంటే దాదాపు 40 ఏళ్లు పడుతుందని ఐరాస అంచనా వేసింది. (Associated Press)
యుద్ధం కారణంగా 23 లక్షల జనాభా ఉన్న గాజాలో దాదాపు 90 శాతం ప్రజలు వలస వెళ్లిన‌ట్లు ఐరాస నివేదిక వెల్లడించింది (Associated Press)

ABOUT THE AUTHOR

...view details