తెలంగాణ

telangana

ETV Bharat / photos

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చి గురించి తెలుసా? - World Tallest Church

World Tallest Church :జర్మనీలోని 'ఉల్మెర్ మున్‌స్టర్' కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చిగా పేరొందింది. ఈ చర్చి గోతిక్ స్టైల్​లో నిర్మితమవుతున్న ప్రముఖ 'లా సగ్రాడా ఫామిలియా బాసిలికా' నిర్మాణం పూర్తియ్యే వరకు ఎత్తైన చర్చిగా నిలవనుంది. ఇంతకీ ఆ చర్చి వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 3:46 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చి జర్మనీలోని ఉల్మ్​లో ఉంది. అదే ఉల్మెర్ మున్​స్టర్​. (Associated Press)
ఉల్మెర్ మునస్టర్ చర్చి నిర్మాణం 1377లో ప్రారంభించారు. కానీ 1543లో ప్రొటెస్టంట్ సంస్కరణల నేపథ్యంలో నిర్మాణం ఆగిపోయింది. (Associated Press)
నిర్మాణ పనులను 1844లో తిరిగి ప్రారంభించి, 1890 మే 31నాటి కల్లా చర్చి పూర్తయింది. (Associated Press)
ఈ చర్చి ఎత్తు 530 అడుగుల ఉంటుంది. (Associated Press)
1944లో రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన బాంబు దాడిలో ఉల్మ్ నాశనమైనప్పటికీ, ఆ చర్చి ఏమాత్రం చెక్కు చెదరలేదు! (Associated Press)
ఈ చర్చిని సందర్శించేందుకు సంవత్సరానికి దాదాపు 10 లక్షలు మంది వస్తారు. (Associated Press)
సందర్శకులు ప్రస్తుతం ఇందులోని 102 మీటర్లు (335 అడుగులు) వద్ద వ్యూ పాయింట్​ వరకు ఉన్న 560 మెట్లు ఎక్కవచ్చు. (Associated Press)
అయితే అంతకుముందు 143 మీటర్ల(469 అడుగులు) వద్ద వచ్చే 768 మెట్ల వరకు అనుమతి ఉండేది. మరమ్మతుల కారణంగా మూసివేశారు. (Associated Press)
స్పెయిల్​లో ఉన్న 'లా సగ్రాడా ఫామిలియా బాసిలికా' నిర్మాణం పూర్తయితే అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చిగా నిలవనుంది. (Associated Press)
బాసిలికా చర్చిని 566 అడుగులు ఎత్తులో నిర్మిస్తున్నారు. (Associated Press)
బాసిలికా చర్చి నిర్మాణం 2026 నాటికి పూర్తవుతుందని అంచనా. (Associated Press)
బాసిలికా నిర్మాణాన్ని 1890 మే 31లో ప్రారంభించారు. అయితే బాసిలికా 144 ఏళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details